వరంగల్ దేశాయిపేట లో ఉత్సాహంగా బడిబాట వరంగల్ ఈస్ట్, జూన్ 7(జనం సాక్షి):
వరంగల్ నగరంలోని దేశాయిపేట లో మంగళవారం బడిబాట కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించారు. సర్కారు బడి కి జై.. ప్రభుత్వ పాఠశాలలో పిల్లల చేర్పించండి అనే నినాదంతో వాడ వాడల తిరుగుతూ బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించే కార్యక్రమాన్నినిర్వహించారు .ఉపాధ్యాయుల బృందం తెలంగాణ విద్యా శాఖ ఆదేశాల మేరకు బడీ బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు స్థానిక పెద్దలు ప్రభుత్వ పాఠశాలలో గురించి ప్రజలకు వివరించారు.ఉచిత మరియు నాణ్యమైన విద్యఆహ్లాదకరమైన వాతావరణం.. విశాలమైన తరగతి గదులు పౌష్టికాహారం.. ఉచిత పుస్తకాలు యూనిఫాం కంప్యూటర్ నేర్పించుట
నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఇచ్చే ఇంగ్లీష్ మీడియం విద్యార్థు బోధన
తదితర ప్రచార అస్త్ర లతో, కరపత్రాల పంపిణీ చేస్తు, పాఠశాల ఆవాస ప్రాంతాలైన ఎన్ హెచ్ నగర్, లక్ష్మి టౌన్ షిప్, ముసలమ్మ కుంట విద్యార్థుల తల్లిదండ్రుల కు అవగాహన కల్పిస్తు, సర్కారు పాఠశాలలో విద్యార్థులను చేర్పి స్తున్నారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అబ్దుల్ షరీఫ్ , కమలాకర్ రావు ,రాజేష్ ,కుమారి ,ప్రభాస్, రఘు వేణు సీఎంవో తదితరులు పాల్గొన్నారు