వరంగల్ రైల్వేస్టేషన్లో తప్పిన పెను ప్రమాదం
వరంగల్ : వరంగల్ రైల్వేస్టేషన్లో పెను ప్రమాదం తప్పింది. స్టేషన్లో ఉన్న ఓవర్ హెడ్ ట్యాంక్ ఒక్కసారి పగిలిపోవడంతో స్టేషన్ మొత్తం నీటి తో తడిసిపోయింది. పై నుంచి వరదలా నీరు రావడం..రైల్వే లైన్‌పై హై వోల్టేజ్ విద్యుత్ సరఫరా అవుతుండటంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. దీంతో సిబ్బంది అలర్టై కొద్దిసేపు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఏంజరిగిందో తెలియక ప్రయాణికులు సిబ్బంది ఆందోళన చెందారు. అసలే రైల్వేస్టేషన్లో 2500 వోల్టేజీ పవర్ సరఫరా ఉండటంతో ఎక్కడ షార్ట్ సర్క్యూట్ అవుతుందోనని సిబ్బంది హైరానా పడ్డారు. నాణ్యతా లోపం వల్లే ట్యాంక్ పగిలిందని సిబ్బంది చెబుతున్నారు. ఎవరికీ ఏమీ జరగకపోవడంతో రైల్వేశాఖ ఊపిరి పీల్చుకుంది.