వరదతో నష్టపోయిన కుటుంబాలపై శీతకన్ను
పట్టించుకోకుండా వదిలేసిన ప్రభుత్వం
ఏలూరు,జూలై26(జనంసాక్షి):వరదలవల్ల అనేక గ్రామాలలో 200నుండి 300 పశువులు కోట్టుకుని పోయాయి. పేదల ఇళ్ళు కూలిపోయాయి. వస్తువులన్ని మునిగి పనికి రాకుండా పోయాయి. ట్రాక్టర్లు, వరి ధాన్యం, ఆయిల్ ఇంజన్లు, మినుములు, లక్షల విలువ చేసే సామాన్లు ఇలా మొత్తం కలిపి ఒక్కో కుటుంబానికి కనీసంగా ఓ 10 లక్షలు నష్టం జరిగిందని అంచనా ఈ లెక్కన నష్టం అంచనా వేస్తే ప్రతి మండలంలో సుమారు రూ.300 కోట్ల నుండి రూ.500 కోట్లు జరిగినట్లు ప్రజలు చెబుతున్నారు. కాని రాష్ట్ర ప్రభుత్వం కుటుంబానికి రూ.2 వేలు, బియ్యం, పప్పు, ఉప్పు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నది. ఈ దశలో నిర్వాసితులకు శాశ్వత పరిష్కారం కావాలి. తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వాసితులకు 2013 చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం జీవో 350 ప్రకారం ఆలస్యమైనందుకు అదనంగా పరిహారం పెంచి ఇవ్వాలి. అంతేకాకుండా 2019 ఎన్నికల ముందు వైసిపి అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి ప్యాకేజితో పాటు మరో రూ.5 లక్షలు అదనంగా ఇస్తామని జగన్‌మోహన్ రెడ్డి హావిూ ఇచ్చారు. కాని నేటికీ నెరవేరలేదు. తక్షణమే ప్రతి మండలంలో ప్రత్యేక బృందాలను నియమించి జరిగిన నష్టాన్ని అంచనా వేసి
పరిహారం చెల్లించాలి. అప్పటి వరకు కుటుంబానికి రూ.10 వేలు నగదు, 3 నెలల పాటు ఆహార దినుసులు, పంట వేసి మునిగిన రైతులకు ఎకరానికి రూ.25 వేల పరిహారం, పడిపోయిన ఇళ్ళకు పక్కా గృహాలు, దెబ్బతిన్న ఇళ్ళకు నష్టపరిహారం చెల్లించాలని స్థానికులు కోరుతున్నారు. అయితే మునిగిపోయిన గ్రామాల ప్రజలను రక్షించడానికి కనీసం రెండు బోట్లు కూడా ఏర్పాటు చేయలేదు. వరద ప్రాంతాల్లో కనీసం పేదలకు ధైర్యం చెప్పేవారు కూడా లేరు. తక్షణమే ప్రతి మండలంలో ప్రత్యేక బృందాలను నియమించి జరిగిన నష్టాన్ని అంచనా వేసి పరిహారం చెల్లించాలి.గోదావరి వరదలకు నష్టపోయిన ప్రజలు, రైతులను ఆదుకోవ డంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కోనసీమ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కర్రి చిట్టిబాబు ఆరోపిం చారు. గోదావరి వరదలకు లంక ప్రాంతాలు, తీర గ్రామాల్లో ఇళ్లకు తీవ్ర ఆస్తి నష్టం వాటిల్లిందన్నారు. ముంపు ప్రాంతాల్లో నిత్యావసరాలు ఇచ్చామంటూ కేవలం నాలుగు టమా టాలు. నాలుగు ఉల్లిపాయలు, నాలుగు బంగాళదుప్పలు ఇచ్చి చేతులు దులుపుకోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.