వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్,ఎఎస్పీ
ఎలిశెట్టిపల్లి గ్రామస్తులను పునరావాస కేంద్రానికి తరలిస్తామన్న కలెక్టర్
ఎన్ డి ఆర్ ఎఫ్, పోలీస్ రిస్క్ టీంలు రెండు బోట్ల ఏర్పాటు
ఎడతెరి పిలేని వర్షాలతో పొంగిపొర్లుతున్న వాగులు వంకలు
రామన్నగూడెం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
ఏటూర్ నాగారం(జనం సాక్ది)జులై 19. ఏటూరు నాగారం మండలంలోని వరద ముంపు గ్రామాలను ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి మరియు ఎటురునాగారం ఏ ఎస్పీ సంకీర్త్ తో కలిసి బుధవారం పరిశీలించారు. మండలంలోని అల్లం వారి ఘనపురం వద్దగల వాగు పొంగిపొర్లడంతో అల్లం వారి ఘనపూర్ చల్పాక వీరాపూర్ ఎలిశెట్టిపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలుసుకున్న కలెక్టర్ ఏ ఎస్ పి జంపన్న వాగు వద్ద పోలీస్ రిస్క్ టీం సభ్యులను మరియు ఎన్ డి ఆర్ ఫ్ బృందాలతో పాటు రెండు బోట్లను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,ఎలిశెట్టిపల్లి గ్రామంలో నివసించే 150 మంది గ్రామస్తులను చల్పాక ఆశ్రమ పాఠశాలలోని పునరావాస కేంద్రానికి తరలిస్తున్నట్లు ఆమె తెలిపారు. మరో రెండు రోజులు భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మండల కేంద్రంలోని లోతట్టు ప్రాంతాలను జెడ్పి సీఈవో ప్రసున్న రాణి, సర్పంచ్ ఈ సం రామ్మూర్తి ఎంపీడీవో కుమార్ ఆధ్వర్యంలో పలు ప్రాంతాలను పరిశీలించి లోతట్టుప్రాంతాల్లో నిలిచిన వర్షపు నీటిని జెసిబి సహాయంతో బయటకు పంపేందుకు సహాయ చర్యలు చేపట్టారు. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నాయి.