వరి కొనుగోలు సెంటర్లను వెంటనే ఏర్పాటు చేయాలి

 – ఐ ఎన్ టి యు సి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారి పర్వతాలు
  బిజినేపల్లి. నవంబర్.15 జనం సాక్షి- ఐకెపి సెంటర్ ద్వారా తక్షణమే ఐ ఎన్ టి యు సి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారి పర్వతాలు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బుధవారం విలేకరుల సమావేశంలో  మాట్లాడుతూ  రైతులు ఆరుగాలం కష్టపడి అతివృష్టి అనావృష్టి చీడపురుగుల నుండి కలుపు మొక్కల నుండి వరి పంటను  పండించిన వరి పంటను రాష్ట్ర ప్రభుత్వం ఐకెపి సెంటర్ల ద్వారా వరి కొనుగోలు చేయకపోవడంతో  ప్రైవేట్ వ్యాపారులు గ్రామాలలో తక్కువ ధరకే కొనుగోలు చేయడం తో రైతులు నిట్ట నిలువునా దోపిడికి గురవుతున్నారని ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది కూడా వరి కొనుగోలు
ప్రవేట్ వ్యాపారులు, దళారులు,
 కుమ్మక్కై వరి రైతులను నిలువున ముంచారని ఆవేదన వ్యక్తం చేశారు.  తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం  వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి క్వింటాలుకు 3 వేల రూపాయలు చొప్పున ధర నిర్ణయించి  కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
 ఈ కార్యక్రమంలో భగత్ శ్రీశైలం,  పండ్ల పాషా, వాల్యా నాయక్, ఎం సత్యం, రాజు తో పాటు తదితరులు ఉన్నారు.

తాజావార్తలు