వరుస వడగళ్లతో రైతులకు తీరని నష్టం

ఆదుకోవాలని ఎమ్మెల్యేలకు వినతి
జనగామ,ఏప్రిల్‌24(జ‌నంసాక్షి): జనగామ జి/-లాలోని పలు మండలాల్లోని  గ్రామాల్లో వారం వ్వయధిలో వడగళ్ల కారణంగా పటంలు దెబ్బతిన్నాయి. మామిడికాయలు నేలరాలాయి. ధాన్యం తడిసి ముద్దయ్యింది. తమను ఆదుకోవాలని స్థాని ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి పలుఉవరు విన్నవించారు. నస్టం అంచనా వేయించి ప్రభుత్వానికి నివేదిస్తానని ఆయన మావిూ ఇచ్చారు. సోమవారం ఉరుములు, మెరుపులతో పాటు గాలి దుమారంతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. రెండు రోజులుగా సాయంత్రం పూట కురిసిన అకాల వర్షం అన్నదాతను అతలాకుతలం చేసింది. వరికోతకు సిద్ధంగా ఉన్న వరిపంట నేలమట్టమయ్యింది. వర్షంతో ఆరుగాలం కష్టపడిన రైతుకు నిరాశే మిగిలింది. అంతేగాకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో వర్షానికి ఆరబోసిన ధాన్యంతోపాటు బస్తాలూ తడిసిపోయాయి. మరోవైపు గాలివానకు పలుగ్రామాల్లోని మామిడి తోటలు దెబ్బతిన్నాయి. కాయలు నేలరాలాయి.  పెద్దపహాడ్‌, ఎర్రకుంటతండా, గానుగుపహాడ్‌, తదితర గ్రామాల్లో మామిడికాయలు నేలరాలాయి. బచ్చన్నపేట మండలం కేశిరెడ్డిపల్లి గ్రామంలో అకాల వర్షానికి కొనుగోలు కేం ద్రంలో నిల్వ చేసిన ధాన్యం తడిసి ముద్దయింది. రైతులు ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చారు. మద్దతు ధర వస్తుందని కొనుగోలు కేంద్రానికి తరలించామని రైతులు వెల్లడించారు. ఇటీవలే జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. అకాల వర్షంతో కేంద్రం ఆవరణలోని బస్తాలు, ఆరబెట్టిన ధాన్యం తడిసింది. కాంట అయిన ధాన్యాన్ని వెంట వెంటనే తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. అదేవిధంగా తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతున్నారు.

తాజావార్తలు