వర్టీకల్స్ అమలుపై నిరంతర పర్యవేక్షణ

వనపర్తి బ్యూరో,జూన్ 29 (జనంసాక్షి) :
తెలంగాణ పోలీసుశాఖ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 15 రకాల వర్టీకల్స్ ను అన్ని స్థాయిల పోలీసు అధికారులు సమర్ధవంతంగా, నిరంతరం అమలయ్యే విధంగా చూడాలని జిల్లా ఇంచార్జ్ ఎస్పీ శ్జె, రంజన్ రతన్ కుమార్ పోలీసు అధికారులను ఆదేశించారు. బుధవారం రోజు జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ భవనంలో నిర్వహించిన ఫంక్షనల్ వర్టీకల్స్ సమావేశంలో ఆయన పోలీస్టేషన్ల వారీగా ఉన్న ఫంక్షనల్ వర్టీకల్స్ పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంచార్జ్ ఎస్పీ మాట్లాడుతూ.
పోలీసు శాఖలో అమలు చేస్తున్న 15రకాల వర్టీకల్స్ విషయంలో ప్రతి పోలీసుఅధికారి శ్రద్ద వహించి సమర్ధవంతంగా అమలయ్యేలా చూడాలన్నారు.
రిసెప్షన్, బ్లూ కోట్స్, పెట్రో కార్స్, స్టేషన్ రైటర్లు, క్రైమ్ రైటర్లు, క్రైం సిబ్బంది, కోర్టు డ్యూటీ ఆఫీసర్స్, వారెంట్, సమన్స్ సిబ్బంది, టెక్ టీమ్, 5 ఎస్, మెడికల్ సర్టిఫికెట్స్, ఎఫ్.ఎస్.ఎల్., సెక్షన్ ఇంచార్జ్, ఐఓలు, జనరల్ డ్యూటీ సిబ్బందికి సంబందించిన వర్టీకల్స్ పై జిల్లా ఇంచార్జ్ ఎస్పీ  సమగ్రంగా సమీక్ష నిర్వహించి అవగాహన కల్పించారు.
ముఖ్యంగా ప్రతి వారం ఒకసారి అన్ని రకాల వర్టికల్స్ పై సమావేశాలు నిర్వహించాలని తద్వారా ప్రజల మన్ననలు పొందేలా పోలీసింగ్ ఉండాలన్నారు.
వర్టికల్స్ అమలు పట్ల అధికారులు తీసుకుంటున్న శ్రద్ద, వాటి పట్ల అవగాహన ఉన్నప్పుడే సత్ఫలితాలు సాధించడం సాధ్యమని చెప్పారు.జిల్లాలో వర్టికల్స్ సమర్ధవంతంగా అమలయ్యే విధంగా ఒక్కో విభాగానికి ఒక్కో నోడల్ అధికారి నిరంతరం సమీక్ష నిర్వహిస్తు ముందుకు సాగాలని ఎస్పీ అధికారులకు వివరించారు.ఈ సమావేశంలో  అదనపు ఎస్పీ, షాకీర్ హుస్సేన్,వనపర్తి డీఎస్పీ, ఆనంద్ రెడ్డి, డీసీఆర్బీ డిఎస్పీ, మహేశ్వర్,సీసీఎస్, ఇన్స్పెక్టర్, శ్రీనివాసచారి,
వనపర్తి సీఐ, ప్రవీణ్ కుమార్, కొత్తకోట సీఐ, శ్రీనివాస్ రెడ్డి, ఆత్మకూరు సిఐ, రత్నం, స్పెషల్ బ్రాంచ్ ఎస్సై, జేలెందర్,
డీసీఆర్బీ ఎస్సై, రాము,ఐటీ కోరు ఎస్సై,వేణు, జిల్లాలోని  అన్ని పోలీస్టేషన్ల ఎస్సైలు, డీసీఆర్బీ మరియు ఐటీ కోరు సిబ్బంది,వర్టికల్ సిబ్బంది పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.