వర్ధమాన సినీ నటుడు ప్రశాంత్ దుర్మరణం
వర్ధమాన సినీ నటుడు ప్రశాంత్ దుర్మరణం పాలయ్యాడు. హైదరాబాద్ కూకట్ పల్లిలోని ఓ అపార్టుమెంట్ ఆరో అంతస్తు నుంచి కింద పడి చనిపోయాడు.
‘ఇప్పట్లో రాముడిలా సీతలా ఎవరుంటారండీ బాబూ’ అనే సినిమాలో ప్రశాంత్ హీరోగా నటిస్తున్నాడు. అతనిది అనంతపురం జిల్లా గుంతకల్లు. డ్యాన్స్ మాస్టర్ గా సినిమాల్లో ప్రవేశించిన ప్రశాంత్.. హీరోగా తొలి ప్రయత్నం చేస్తున్నాడు.