వర్మి కంపోస్టు ద్వారా గ్రామాలకు అదనపు ఆదాయం
నల్లబెల్లి జూన్ 10 (జనం సాక్షి):
వర్మి కంపోస్టు ద్వారా గ్రామాలకు అదనపు ఆదాయం వస్తుందని మేడపేల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రవణ్ పేర్కొన్నారు. ఐదో విడత పల్లె ప్రగతి లో భాగంగా మండలంలోని మేడపేల్లి గ్రామపంచాయతీ పరిధిలోని సేగ్రీ గేషన్ షెడ్లో వర్మి కంపోస్టు ఎరువు శుక్రవారం తయారు చేశారు. ఈ సందర్భంగా తయారైన కంపోస్ట్ ఎరువును కిలోకు రూ.8 చొప్పున 25 కిలోలను రైతులకు విక్రయించారు.మిగిలిన ఎరువును హరితహారంలోని మొక్కలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
Attachments area