వర్షాకాలం వస్తుంది అధికారులు ముందస్తు చర్యలకు సిద్ధం కావాలి
ఎం పీ పీ రాణి బాయ్
మహాదేవపూర్ జూన్ 23 (జనంసాక్షి)
మహాదేవపూర్ మండల పరిషత్ కార్యాలయంలో ఎం పీ పీ అధ్యక్షతన ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ముందస్తు చర్యలపై సమావేశం ఏర్పాటు చేశారు. ఇట్టి సమావేశంలో ఎంపీడీవో శంకర్ మాట్లాడుతూ భారీ వర్షాలు కురిసినపుడు లోతట్టు ప్రాంతాలు జలమయం అయిన సందర్భంలో వెంటనే స్థానిక సర్పంచ్ లు ఎంపిటిసి లు. పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేక అధికారులు గ్రామములో ప్రాణనష్టం, ఆర్థిక నష్టం సంభవించ కుండా ప్రజలను అప్రమత్తం చేసి పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమైనందున ముందస్తు చర్యల్లో భాగంగా పునరావాస కేంద్రాలుగా ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ భవనాలను గుర్తించాలని. భారీ వర్షాలు కురిసే సందర్భములో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. ముఖ్యముగా గోదావరి నది తీర ప్రాంతంలో ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించినారు. భారీ వర్షాల వలన నదులు, కాలువలు, వాగులు, వంకలు పొంగి నీటి మట్టం పెరిగిన సందర్భంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, రహదారులపై సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని , ప్రజలు నీటి ప్రవాహంలో ప్రయాణించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మరియు భారీ వర్షాల వలన ఇంటి పైకప్పులు, మట్టి గోడలు కులే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.ఈ సమావేశంలో ఎంపిడిఓ శంకర్ డిప్యూటీ తహసీల్దార్ .ఎస్ఐ రాజ్ కుమార్ . కరెంటు ఏఈ నరేష్ .పి.ఆర్. ఏ. ఇ రవీందర్ , ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ శ్రీ చల్లా తిరుపతయ్య ఎంపిటిసిలు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు