వర్షానికి దెబ్బతిన్న పంటలు

మెదక్‌,మార్చి02(జ‌నంసాక్షి):  చేగుంట మండలం మక్కరాజుపేట గ్రామంలో ఆదివారం కురిసిన భారీ వర్షానికి మొక్కజొన్న, బీన్స్‌ పంటలు దెబ్బతిన్నాయి. వడగళ్ల వాన వల్ల సుమారు 50 ఎకరాల మొక్కజొన్న, 20 ఎకరాల బీన్స్‌ పంట పాడైనట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. అలాగే గాలి వేగంగా వీయడంతో పలుచోట్ల విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి.