వర్షానికి వీరన్న పేటలో కూలిన ఇల్లు
పరిశీలించిన మహబూబ్ నగర్ అర్బన్ తహసిల్దార్
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి జూలై 20 (జనం సాక్షి)మహబూబ్ నగర్ జిల్లాలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు బుధవారం రాత్రి మహబూబ్నగర్ పట్టణంలోని వీరన్నపేట లో సాని శ్రీశైలం కు చెందిన ఇల్లు కూలిపోయింది . శ్రీశైలం ఆటో నడుపుకొని కుటుంబాన్ని పోషించు కుంటూ జీవనం సాగిస్తుంటాడు . నిరుపేద కుటుంబం అయినా శ్రీశైలం ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు . ఇల్లు కూలిన విషయం తెలిసిన వెంటనే మహబూబ్ నగర్ అర్బన్ తహసిల్దార్ పార్థసారథి హుటాహుటిన వీరన్నపేట కు వెళ్లి కూలిన ఇల్లును పరిశీలించారు . నివేదికను సిద్ధం చేసి కలెక్టర్ సమర్పిస్తామని తాసిల్దార్ తెలిపారు . శ్రీశైలం ఇల్లు కూలిన సంఘటనను మంత్రి శ్రీనివాస్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం నుండి సహకారం అందే విధంగా కృషి చేస్తానని బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఆర్ శివరాజ్ తెలిపారు .ప్రజలు అప్రమత్తంగా ఉండాలితాసిల్దార్ పార్థసారథిగత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మహబూబ్ నగర్ అర్బన్ తాసిల్దార్ పార్థసారథి ప్రజలకు విజ్ఞప్తి చేశారు . పాత ఇళ్లలో నివాసం ఉంటున్న వారు , శిథిలావస్థలో ఉన్న పాత ఇళ్లను ఖాళీ చేసి వేరే ఇళ్లకు మారాలని సూచించారు . విద్యుత్ స్తంభాలకు , వైర్లకు ప్రజలు దూరంగా ఉంటూ అప్రమత్తంగా ఉండాలని కోరారు . తల్లిదండ్రులు తమ పిల్లలను చెరువులు , కుంటలు , వాగుల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు .