వర్షాలకు ఇల్లు కూలిన వృద్ద దంపతులకు తాత్కాలిక ఇంటినిర్మాణం చేయించిన కోవిడ్ వాలంటీర్స్.

తాత్కాలిక ఇంటిని అందించిన కోవిడ్ వాలంటీర్స్ సభ్యులు.
నెన్నెల, సెప్టెంబర్23,(జనంసాక్షి)
గత నెలలో నెన్నెల మండలంలో కురిసిన భారీ వర్షానికి కోనంపేట్ గ్రామానికి చెందిన నిరుపేద ఆదివాసీ గిరిజన వృద్దదంపతులైన జంబి కొండయ్య-లచ్చక్క ల ఇల్లు భారీ వర్షాలకు కూలిన విషయం విదితమే. ఈ నిరుపేద బాధిత కుటుంబానికి కోవిడ్ వాలంటీర్స్ బృందం అండగా నిలిచింది. కోవిడ్ వాలంటీర్స్ బృందం సమన్వయ కర్త జలంపల్లి శ్రీనివాస్ వెంటనే బాధిత కుటుంబ స్థితిగతులు వివరిస్తూ దాతల సహాయం కోరగా ₹ 20,501 జమ అయ్యాయి. ఈ డబ్బులతో తాత్కాలిక ఇంటి నిర్మాణం పూర్తి చేయించి ఆ వృద్ద దంపతులకి గురువారం అందజేశారు. (రేకులు, పోల్స్, పైపులు, దర్వజా అందించి, కూలీలతో నిర్మాణం పూర్తి పనులు) . ఈ కార్యక్రమంలో తమ పూర్తి భాగస్వామ్యం అందించిన దాతలందరికీ, స్థానిక సర్పంచ్ కంకణాల తిరుపతి రెడ్డి,స్థానిక ఉపాద్యాయులు దండవేని మల్లేశ్, రత్న రాజన్న, సదయ్య జర్నలిస్ట్ లు గౌసోద్దీన్ బాబా, రాంటెంకి శ్రీనివాస్ లకు కోవిడ్ వాలంటీర్స్ బృందం సమన్వయ కర్త జలంపల్లి శ్రీనివాస్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.