వర్షాలతో చెరువులకు జలకళ

వరంగల్‌,ఆగస్ల్‌18(జ‌నం సాక్షి): మిషన్‌కాకతీయ సత్ఫలితాలిచ్చిందని నీటిపారుదలశాఖ అధికారులు పేర్కొన్నారు. జిల్లాలో చెరువులు, కుంటలు నిండి జలకళ ఉట్టిపడుతున్నాయన్నారు. జిల్లాలోనిపలు చెరువుల్లో భారీగా నీరు వచ్చి చేరింది. పాఖాల, లక్నవరం,రామప్పలకు నీరు చేరుతోంది. ప్రాజెక్టులు నిండాయని, రైతుల కళ్లల్లో ఆనందం కనిపిస్తున్నదని చెప్పారు. గతంలో నిర్లక్ష్యానికి గురైన చెరువులు, కుంటలు మిషన్‌కాకతీయతో పూర్వవైభవాన్ని సంతరించుకున్నాయని, రైతన్నలకు సాగునీటి భరోసానిస్తున్నాయని తెలంగాణ నేతలు అన్నారు. ఇది తెలంగాణ ప్రభుత్వానికి రైతులపట్ల ఉన్న శ్రద్ధకు నిదర్శనమని చెప్పారు. చెరువులు,ప్రాజెక్టుల వద్ద అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు నిండాయని, ఆశించిన స్థాయిలో ప్రాజెక్టుల నీటిసామర్థ్యంతో కళ కళలాడుతున్నాయని చెప్పారు. గతంలో ప్రారంభించిన వరదగేట్ల నిర్మాణం పనులు మార్చి నాటికి పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

————