వర్షాలతో సీజనల్ వ్యాధుల పట్ల విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి

– డీఎంవో విజయ్ కుమార్
చౌడాపూర్, ఆగస్టు 08( జనం సాక్షి): ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలోని వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల కేంద్రంలోని కొత్తపల్లి గ్రామంలోని వసతి గృహంలోని విద్యార్థులకు సీజనల్  వ్యాధుల పట్ల డీఎంవో విజయ్ కుమార్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా గిరిజన ఆశ్రమ పాఠశాలలో డాక్టర్ విజయలక్ష్మి ఆదేశాల మేరకు డిడిటి అనే మందును పిచికారి చేయించడం జరిగింది.ప్రతి విద్యార్థి పరిసరాల పరిశుభ్రతను అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది రాములు, ఎంపీహెచ్ఈఓ శరభలింగం, హెల్త్ అసిస్టెంట్లు రమణ,పుష్పలత, ఏఎన్ఎం ఆశా వర్కర్ల కళమ్మ, నారసింగమ్మ, అంజమ్మ, పార్వతమ్మ మరియు వెంకటేష్, కేశవులు తదితరులు పాల్గొనడం జరిగింది.