వలస కూలీలు మృతి చెందిన పట్టించుకునే నాథుడే లేడు
సీపీఐ మండల కార్యదర్శి కృష్ణాజీ
బిజినేపల్లి, జనం సాక్షి .నవంబరు 29, పాలమూర్ రంగారెడ్డి రిజర్వాయర్ పనులు చేసేందుకు వివిధ రాష్ట్రాల నుండి వచ్చి ప్రాజెక్టులలో పనులు చేస్తున్న వలస కూలీ లు ప్రమాదవశాత్తు మృతి చెందిన పట్టించుకునే నాధుడే కరువయ్యాడని సీపీఐ మండల కార్యదర్శి పి. కృష్ణాజీ అవేదన వ్యక్తం చేశారు. మండలంలోని వసంతపూర్లో మంగళవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వట్టెం రిజర్వాయర్ నిర్మాణం పనులు చేస్తున్న కంపినీల్లో వివిధ పనులు చేసేందుకు వచ్చిన వలస కార్మికులు ప్రమాదాల గురై మృతి చెందిన ఎలాంటి పరిహారం ఇవ్వకుండానే చేతులు దులుపుకున్నారని విమర్శించారు. అండర్ గ్రౌండ్ పనులు చేస్తుండగా ప్రమాదశాత్తు పశ్చిమ బెంగాల్కు చెందిన జగదీశ్ రాయ్ మృతి చెందగా గుట్టు చప్పుడు కాకుండా శవా అన్ని స్వంత రాష్ట్రానికి పంపించారే తప్పా బాధితుడి కుంటుంబానికి ఎలాంటి ఆర్ధిక సాయం అందించలేదన్నారు. ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో ఇప్పటి వరకు మృతి చెందిన వారి తరుపున లేబర్ కోర్టు కేసు వేసి న్యాయం జరిగే వరకు సీపీఐ తరుపున పోరాటం చేస్తావ ని అన్నారు.