వసివాడే “మొగ్గ”లు…

స్వేచ్చగా విహరించే బాల్యం
ఆంక్షల “చెరసాల”లో మగ్గుతోంది

ఆట పాటలతో “అలరారు” ప్రాయం
పుస్తక పుటల్లో “నెమలి”కై నలుగుతోంది

అమ్మ ఒడిలో “సేద”దీరు శైశవం
నాలుగు గోడల మధ్య శుస్కిస్తోంది

నాన్న వేలు పట్టి తిరిగే అడుగు
కాన్వెంట్ “కబేలా’కు తరలుతోంది

పచ్చగా చిగురించే లేత దేహం
బ్యాగుల “మోత”కు వసివాడుతోంది

కోయిల రాగాలై కూసే గొంతు
బట్టి “పాఠాల” వల్లెవేస్తోంది

పరీక్షల “మెట్లు” ఎక్కలేక
మార్కుల “పట్టు” పట్టలేక
భయం నీడన “బతుకు” తెల్లారుతోంది

ఇంతగా…
బాల్యాన్ని “బలి” చేస్తున్నదెవరు?
భావి “తార”ల చిదిమేస్తున్నదేవరు?

ఇంకెవరు?
తమ ఆశా సౌదాన్ని పిల్లల
బతుకు పునాదులపై
నిర్మించ యత్నించే తల్లిదండులు

కాసులకు నోళ్లుతెరిచే
కార్పొరేట్ కర్కోటక రాకాసులు

ఇప్పటికైనా..
ఈ సంకుచిత “తత్వాలు” విడనాడితే…
ఈ విష సంస్కృతి “చరమ” గీతి పాడితే…

బావితరం”బంగారు” బాటన పయనిస్తుంది
భారతావని సస్య శ్యామలమై విలసిల్లుతుంది
“”””””””””””””
కోడిగూటి తిరుపతి
(జాతీయ ఉత్తమ కవి పురస్కార గ్రహీత)
Mbl no:9573929493