వస్తా మళ్లీ మళ్లీ వస్తా -మేము తలుచుకుంటే మీరు తిరగగలరా! కాంగ్రెస్ పార్టీ నేతలకు ఎమ్మెల్యే రెడ్యా సవాల్
– నా మీద అభిమానం ఉన్నవాడే ఓటు వేస్తారు.
-వానాలో వరాలు కు కురిపించిన-ఎమ్మెల్యే రెడ్యా
డోర్నకల్/కురవి, జులై -18 జనం సాక్షి న్యూస్: వస్తా మళ్లీ మళ్లీ వస్తా మీ గ్రామానికి పదిసార్లు వచ్చా ఈ మోకాలు వచ్చి నన్నెప్పుడు కలవలే ఒకసారి కూడా అడగలే ఇప్పుడు చెప్తున్నారు అని హరిదాస్ తండా గ్రామంలో ఎమ్మెల్యే రెడ్యా అన్నారు. మంగళవారం కురవి మండలంలోని స్టేషన్ గుండ్రాతిమడుగు, పోలంపల్లి తండ, హరిదాస్ తండా గ్రామాలలో డోర్నకల్ శాసనసభ్యులు డిఎస్ రెడ్యా నాయక్ పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవ, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామానికి గృహలక్ష్మి పథకం కింద గుడిసె ఉండి సొంత జాగా ఉన్నోనికి రెండు నెలల లోపు డబుల్ బెడ్ రూమ్ లు ఇండ్లు ఇస్తాం,స్టేషన్ గుండ్రాతిమడుగులో బోరు, సిసి రోడ్డు, పోలంపల్లితండా గ్రామంలో 20 లక్షల వ్యయంతో గ్రామపంచాయతీ నూతన భవనం, శంకుస్థాపన సీసీ రోడ్ల ప్రారంభోత్సవం రెండు ట్రాన్స్ఫార్మర్లు ఇస్తామని, అదేవిధంగా హరిదాస్ తండా గ్రామపంచాయతీలో ప్రారంభోత్సవ, శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే రెడ్యా నాయక్. వివిధ గ్రామాల్లో పలు రకాల భూములు ఎన్నో ఏళ్ల తరబడి తాత ముతాతలు నుండి సాగు చేసుకుంటున్నా భూములు రైతులకు పట్టాదారు పుస్తకం కాకపోవడంతో అందరికీ పట్టాలు అయ్యే విధంగా జిల్లా కలెక్టర్ శశాంకతో మాట్లాడి భూ సమస్యలను పరిష్కరిస్తానని శాసనసభ్యుడు రెడ్యా నాయక్ రైతులకు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ గూగులోత్ పద్మావతి రవి నాయక్, మండల అధ్యక్షుడు తోట లాలయ్య,బిఆర్ఎస్ జిల్లా నాయకులు బజ్జూరి పిచ్చి రెడ్డి, మాజీ ఎంపీపీ రామచంద్రయ్య, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు ఎర్రం రెడ్డి సుధాకర్ రెడ్డి, మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ ముండ్ల రమేష్, వివిధ గ్రామాల సర్పంచులు నరేష్, లాలు, భూక్య సరిత విజయ్, మస్తాన్, మండల యూత్ అధ్యక్షుడు బానోతు రమేష్,మండల టిఆర్ఎస్ నాయకులు పెద్ది వెంకన్న, రాజు నాయక్, పేర్ల గణేష్, బానోత్ గణేష్, సోషల్ మీడియా సూర్య,దీపక్, రాజు,రమేష్,వివిధ గ్రామాల అధ్యక్షులు బాలు, వీరన్న, ఉప సర్పంచ్ శోభన్ బాబు, బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రజాప్రతినిధులు అధికారులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.