వస్తు సేవల బిల్లుపై చర్చించాం

2
– అరుణ్‌ జైట్లీ

న్యూఢిల్లీ,నవంబర్‌27(జనంసాక్షి):

వస్తు సేవల పన్ను (జీఎస్టీ) బిల్లుకు సంబంధించి కాంగ్రెస్‌ నేతలతో మరోసారి సమావేశం అయ్యే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తెలిపారు. ప్రధాని మోడీ ఆహ్వానం మేరకు ఢిల్లీలోని ఆయన నివాసానికి కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ వెళ్లారు. వారి భేటీ తర్వాత వివరాలను జైట్లీ విలేకరులకు వెల్లడించారు. పలు అంశాలు తమ మధ్య చర్చకు వచ్చాయని, ప్రధానంగా జీఎస్టీ బిల్లుపై చర్చించామని చెప్పారు. జీఎస్టీ బిల్లుకు సంబంధించి కాంగ్రెస్‌ నేతలు మూడు సూచనలు చేశారని, తమ ప్రభుత్వ అభిప్రాయాలను కూడా వారికి వివరించామని జైట్లీ చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ సమావేశంలో చర్చించుకున్న తర్వాత మరోసారి సమావేశం అయ్యే అవకాశం ఉందన్నారు. ఈ సమావేశంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు కూడా పాల్గొన్నారు.