వాటర్‌ గ్రిడ్‌ ప్రతిష్టాత్మకం

1
– యుద్దప్రాతిపదికన సాగాలి

– సీఎం కేసీర్‌ సమీక్ష

హైదరాబాద్‌,నవంబర్‌ 25 (జనంసాక్షి):

వాటర్‌గ్రిడ్‌ ద్వారా నీళ్లివ్వకుంటే ఓట్లడగబోమని చెప్పామని, . దీన్ని దృష్టిలో పెట్టకొని పనులు వేగవంతం చేయాలని అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. బుధవారం మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ది సంస్థలో వాటర్‌గ్రిడ్‌, గోదావరి జలాలను హైదరాబాద్‌కు తరలించే పనుల పురోగతిపై సీఎం సవిూక్ష చేపట్టారు. వాటర్‌గ్రిడ్‌ ప్రాజెక్టును దేశమంతా ఆసక్తిగా గమనిస్తోందన్నారు. సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో జాప్యం వద్దని అధికారులను ఆదేశించారు. భూసేకరణ, డిజైనింగ్‌, బిల్లుల చెల్లింపు ఆలస్యం కాకుండా విధానాలు సరళీకృతం చేశాం కేసీఆర్‌ పేర్కొన్నారు.  ప్రాజెక్టులకు భూసేకరణ, డిజైన్లు, టెండర్లు, ఆర్థిక అనుమతులు తదితర విషయాల్లో ప్రభుత్వం చాలా మార్పులు తెచ్చిందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. ఈ మార్పును అధికారులు సానుకూలంగా తీసుకుని పనుల్లో వేగం పెంచాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..వాటర్‌గ్రిడ్‌ పథకం పట్ల దేశమంతా ఆసక్తిగా చూస్తుంది. వాటర్‌గ్రిడ్‌ పనులను అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. వాటర్‌గ్రిడ్‌ నల్లాల కోసం ప్రజలు కూడా ఎదురు చూస్తున్నరు. నాణ్యతా ప్రమాణాల్లో ఎట్టిపరిస్థితుల్లో రాజీపడొద్దు. నీటిపారుదల ప్రాజెక్టులు అంటేనే జాప్యానికి మారుపేరుగా ఉంది. పెద్ద స్కీములుంటే ఏళ్లతరబడి సాగదీస్తున్నారు. ఈ పద్ధతి పూర్తిగా మారాలి. భూసేకరణ, డిజైన్లు, టెండర్లు, ఆర్థిక అనుమతులు తదితర విషయాల్లో ప్రభుత్వం చాలా మార్పులు తెచ్చింది. దానిని సానుకూలంగా తీసుకుని పనుల్లో వేగం పెంచాలి. ప్రాజెక్టు నిర్మాణంతో పాటు నిర్వహణ బాధ్యత కూడా అధికారులే నిర్వర్తించాలి. నీటి సరఫరాకు ఎక్కడా ఇబ్బంది కలుగకుండా ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. అదేవిధంగా రైల్వే క్రాసింగ్‌ల దగ్గర త్వరితగతిన అనుమతులు ఇచ్చే విషయంలో సానుకూలంగా స్పందించిన రైల్వేశాఖ అధికారులకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావు, ఎమ్మెల్యేలు, నీటిపారుదలశాఖ అధికారులు పాల్గొన్నారు.