వాటర్ ప్లాంట్ యజమాని కి జరిమానా…..

 -టాస్క్ ఫోర్స్ పోలీస్, ఫుడ్ సేఫ్టీ,బల్దియా  సంయుక్త అద్వర్యం లో దాడులు..
 వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 20(జనం సాక్షి)
  బల్దియా పరిధి 14 వ డివిజన్  లక్ష్మీ గణపతి నగర్ లో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న వాటర్ ప్లాంట్ యజమానికి రూ.10 వేలు జరిమానా విధించినట్లు ఎం.హెచ్.ఓ.డా.రాజేష్ తెలిపారు.
   వాటర్ ప్లాంట్ నిర్వహకులు బల్దియా నుండి అనుమతులు తీసుకోవడం తప్పనిసరి అని,నీరు విక్రయించాలంటే తప్పనిసరిగా నాణ్యత ప్రమాణాలు పాటించాలని,ఇలాంటి నీటిని త్రాగడం ప్రజల ఆరోగ్యానికి అంత శ్రేయస్కరం కాదని,ఇష్టానుసారం గా బోర్ల ద్వారా నీటిని తీసి  స్థితిగతులు పరిశీలించకుండా నీటి విక్రయం సరికాదని,దీని వల్ల ఆరోగ్యం పై తీవ్ర దుష్పరిణామాలు ఉంటాయని,అనుమతులు పొందకుండా వాటర్ ప్లాంట్ నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆరోగ్యాధికారి తెలిపారు.
    ఇట్టి కార్యక్రమం లో టాస్క్ ఫోర్స్ సి.ఐ. నరేష్ కుమార్,ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ వాసు, సానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్రం శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Attachments area