వాతావరణశాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తం

అధికారులకు హెచ్చరికలు జారీ చేసిన సిఎం కెసిఆర్‌
గోదావరి పరివాహక ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండండి
అధికారులు,మంత్రులకు సిఎం కెసిఆర్‌ ఆదేశాలు

హైదరాబాద్‌,జూలై23(జనంసాక్షి): మరో మూడు,నాలుగు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఎగువ నుంచి గోదావరిలోకి భారీ వరద వచ్చే అవకాశం ఉంది. దీంతో గోదావరి పరివాహక జిల్లాలకు చెందిన మంత్రులను, ఎమ్మెల్యేలను అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ప్రాణ,ఆస్తి నష్టం జరగకుండా ఉండాలని సీఎం చెప్పారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని ప్రాజెక్ట్‌లు, చెరువులు, కుంటలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో వర్షాలు, వరదలపై సీఎం కేసీఆర్‌ ఆరా తీశారు. మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డితో ఫోన్లో మాట్లాడిన సీఎం ఎప్పటికప్పుడు పరిస్థితిని సవిూక్షించాలని ఆదేశించారు. అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని, వరద ముంపునకు గురయ్యే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మరో 24 గంటల పాటు అవసరమైన అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన చోట యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని చెప్పారు. హెలీపాడ్‌లను సిద్ధంగా ఉంచాలని సీఎం ఆదేశించారు. రాబోయే 3 రోజుల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఈశాన్య, ఉత్తర తెలంగాణ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. రాగల 4 వారాల పాటు వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాగల 3 రోజులు అతి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్‌ పరిసర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. మోస్తరు నుంచి గట్టి జల్లులు పడే అవకాశం ఉంది. ఇప్పటికే సాధారణ వర్షపాతం కంటే అత్యధికంగా నమోదు అయిందని వాతావరణ శాఖ తెలిపింది. నిజామాబాద్‌ జిల్లాలో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు అలుగు పోస్తున్నాయి. ప్రాజెక్టులు నిండు కుండలా మారాయి. రాబోయే 3 రోజుల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఈశాన్య, ఉత్తర తెలంగాణ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. రాగల 4 వారాల పాటు వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాగల 3 రోజులు అతి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్‌ పరిసర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. మోస్తరు నుంచి గట్టి జల్లులు పడే అవకాశం ఉంది. ఇప్పటికే సాధారణ వర్షపాతం కంటే అత్యధికంగా నమోదు అయిందని వాతావరణ శాఖ తెలిపింది. నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి వర్షం కురుస్తున్నది. భారీగా వరద పోటెత్తడంతో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు 9 గేట్లు, కౌలాస్‌నాలా ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తివేశారు. నిజాంసాగర్‌, పోచారం ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతున్నది. భారీగా వరద వస్తుండటంతో అధికారులు నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌ గేట్లు ఎత్తివేశారు. ప్రస్తుతం ప్రాజెక్టు నీటిమట్టం 1402 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు. సాగర్‌ పరివాహక ప్రాంత ప్రజలు
అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. జగిత్యాల జిల్లాలో భారీగా వర్షం కురుస్తున్నది. అనంతరం జాతీయరహదారిపై వరద పారుతున్నది. దీంతో ధర్మపురి`జగిత్యాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మహబూబాబాద్‌ జిల్లాలో భారీ వర్షాలకు అర్పనపల్లి వంతెనపై వట్టివాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో కేసముద్రం`గూడూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దంతాలపల్లి మండలంలో పాలేరు వాగు పొంగిపొర్లుతుండటంతో దంతాలపల్లి`పెద్దముప్పారం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నర్సింహులపేట మండలం కొమ్ములవంచలో ఓ స్కూలు బస్సు వరదలో చిక్కుకుపోయింది. దీంతో గ్రామస్థులు జేసీబీ సాయంతో బస్సును బయటకు తీశారు. నరసింహులపేటలో ఆకేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. ములుగు జిల్లాలో ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తున్నది. భారీ వానలకు ముత్తారం వాగు ఉగ్రరూపం దాల్చింది. వాగు ఒక్కసారిగా పొంగడంతో గ్రామస్థులు వరదలో చిక్కుకుపోయారు. అయితే ట్రాక్టర్‌ డ్రైవర్‌ అప్రమత్తతో గ్రామస్తులు క్షేమంగా బయటపడ్డారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో వర్షం దంచికొట్టింది. దీంతో సిద్దిపేట జిల్లాలోని మోయతుమ్మెద వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. హనుమకొండ`సిద్దిపేట లోలెవల్‌ బ్రిడ్జిపైనుంచి వాగు పారుతున్నది. దీంతో బస్వాపూర్‌ వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటుచేసి.. వాహనాల రాకపోకలను నిలిపివేశారు. పోరెడ్డిపల్లి విూదుగా హుస్నాబాద్‌ వైపు వాహనాలను దారిమళ్లించారు. మిర్దొడ్డి మండలం అల్వాల్‌లో కూడవలి వాగు జోరుగా ప్రవహిస్తున్నది. వాగు ఉధృతికి ఓ యువకుడు గల్లంతయ్యాడు. గున్నలవాగు ఉధృతికి హవేలీఘనపూర్‌`తిమ్మాయిపల్లిలో రాకపోకలకు అంతరాయం ఏర్పడిరది.