వాతావరణ మార్పులపై పోరుకు మేం సిద్ధం
– వాళ్లు చేతులు కలిపారు
– షరీప్‌తో మోదీ కరచాలనం
– పారిస్ మృతులకు అధినేతల నివాళి
న్యూఢిల్లీ నవంబర్ 30 (జనంసాక్షి):
వాతావరణ మార్పులపై అత్యవసర పోరుకు ప్రపంచ దేశాలు సన్నద్ధం కావాలని భారత ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. సోమవారం పారిస్‌లో జరిగిన కాప్-21 శిఖరాగ్ర సదస్సులో ఆయన పాల్గొన్నారు. భారత్ పెవిలియన్‌ను ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ.. వాతావరణ మార్పులపై పోరాడేందుకు భారత్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
ఇంకా ఆయనేమన్నారంటే.. ‘వాతావరణ మార్పుల అంశం ఇప్పుడు ప్రపంచం ముందున్న అతిపెద్ద సవాలు. భవిష్యత్‌ను మార్చుకునేందుకు 196 దేశాలు కలిసి వచ్చాయి. సాంకేతికత సహా వనరులను పరస్పరం పంచుకోవాల్సిన అవసరం ఉంది. వాతావరణ మార్పుల అంశం మన తప్పిదం కాదు.’ అని అన్నారు.
పారిస్ సదస్సులో భారత్, పాక్ ప్రధానుల కరచాలనం
ఫ్రాన్స్‌లోని పారిస్‌లో జరుగుతున్న అంతర్జాతీయ వాతావరణ సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌లు కలుసుకున్నారు. ఆత్మీయంగా వారు కరచాలనం చేసుకోవడం మీడియా దృష్టిని ఆకర్షించింది. ఈరోజు పారిస్‌లో వాతావరణ మార్పులపై అంతర్జాతీయ స్థాయి సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సుకు హాజరైన మోదీ, షరీఫ్‌లు ఒకరినొకరు కలుసుకుని నవ్వుతూ కరచాలనం చేశారు. ఈ ఫొటోను భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ఈ సదస్సుకు ప్రపంచ దేశాల నుంచి దాదాపు 140 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు.
వాతావరణ మార్పులను సమష్టిగా ఎదుర్కోవాలి: ఒబామా
వాతావరణ మార్పులను సమష్టిగా ఎదుర్కోవాలని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పిలుపునిచ్చారు. వాతావరణ మార్పులపై నిర్వహించిన శిఖరాగ్ర సదస్సులో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఒబామా మాట్లాడుతూ.. వాతావరణ మార్పులపై సదస్సు నిర్వహించిన తొలితరం తమదేనని వ్యాఖ్యానించారు. గత ఏడేళ్లుగా ఎన్నో వాతావరణ మార్పులను ఎదుర్కొంటున్నామని రెండు వారాల పాటు జరగనున్న ఈ సదస్సు సత్ఫలితాలను ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కాప్ 21 సదస్సులో నేతల ప్రసంగాలు..
ఫ్రాన్స్‌లోని పారిస్‌లో జరుతున్న అంతర్జాతీయ వాతావరణ సదస్సులో పలువురు ప్రపంచ అగ్రనేతలు ప్రసంగించారు. వాతావరణ మార్పులపై చర్చించడానికి సోమవారం పారిస్‌లో అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. తొలుత ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ ¬లాండే ప్రసంగించారు. తర్వాత ఐరాస ప్రధానకార్యదర్శి బాన్‌కీమూన్, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రసంగించారు. చెయనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, రష్యా అధ్యక్షుడు పుతిన్ వాతావారణ మార్పులపై ప్రసంగించారు.
ప్రసంగాలలో ప్రధాన అంశాలు.. ఈ సదస్సులో అత్యంత నిర్మాణాత్మకమైన, అర్థవంతమైన ఒప్పందం జరగాలని ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్‌కీ మూన్ అన్నారు. వాతావరణ మార్పులపై సమస్యలను సమష్టిగా ఎదుర్కోవాలని అమెరికా అధ్యక్షుడు ఒబామా అన్నారు. ఈ సమస్యలపై సదస్సు నిర్వహిస్తున్న తొలితరం తమదే అన్నారు. కాప్ 21 సదస్సు వాతావరణ మార్పులపై సమస్యలకు పరిష్కారం చూపడానికి ఒక ప్రారంభం అని.. ఇదే ఆఖరిది కాదని చెయనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అన్నారు. జర్మనీ సహా యూరోపియన్ యూనియన్‌లోని దేశాలు వాతావరణం, ఆర్థికవ్యవస్థపై కార్బన్ ప్రభావం లేకుండా కృషి చేస్తామని జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ అన్నారు. వాతావరణ సమస్యలపై పోరాడడానికి పాటించాల్సిన విధానాలకు అధిక ప్రాధాన్యమివ్వాలని ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ పేర్కొన్నారు. ఆర్థిక అభివృద్ధిపై ఎంత దృష్టి పెడుతున్నామో వాతావరణ పరిరక్షణపై కూడా అంతే జాగ్రత్త తీసుకోవాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు.
ఒబామాతో సమావేశమైన మోదీ
పారిస్ అంతర్జాతీయ సదస్సు నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో సమావేశమయ్యారు. వాతావరణ మార్పుల కారణంగా సమస్యలు, పరిష్కారాలు, దేశాల మధ్య పరస్పర సహకారం తదితర అంశాలపై వారు చర్చించినట్టు తెలిసింది.. వాతారణ మార్పులపై పారిస్‌లో ప్రారంభమైన అంతర్జాతీయ సదస్సుకు ప్రపంచ దేశాధినేతలు హాజరయ్యారు.ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో వాతావరణ మార్పులపై ‘కాప్ 21’ పేరుతో సదస్సు ప్రారంభమైంది. దీనికి గుర్తుగా ట్విట్టర్ కొత్త ఇమోజీలను ఏర్పాటు చేసింది. హ్యాష్ ట్యాగ్‌తో కాప్ 21 అని రాసినపుడు పక్కన ఆకు ఆకారం లోపల ఐఫిల్ టవర్‌తో కూడిన ఇమోజీ వస్తుంది. హ్యాష్ ట్యాగ్‌తో యాక్షన్‌డే, క్లైమేట్ ా’ాంజ్ అని రాసినపుడు హృదయాకారంలోని ప్రపంచపటంతో కూడిన ఇమోజీని ఏర్పాటు చేశారు. ఈరోజు ప్రారంభమైన ఈ సదస్సు డిసెంబరు 11 వరకు కొనసాగుతుంది.
పారిస్ మృతులకు నివాళులర్పించిన అగ్రనేతలు
ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరుగుతున్న అంతర్జాతీయ వాతావరణ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ప్రపంచ దేశాల అగ్రనేతలు, ప్రతినిధులు ఇటీవల పారిస్ ఉగ్రఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించారు. పారిస్‌లో ఇటీవల ఉగ్రవాదులు దాడులు చేయడంతో 129 మంది మరణించిన సంగతి తెలిసిందే. పారిస్‌లో సోమవారం వాతావరణ మార్పులపై ప్రపంచ స్థాయి సదస్సు ప్రారంభమైంది. దాదాపు 150 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. సదస్సు ప్రారంభంలో దేశాల ప్రతినిధులు ఉగ్రవాదులు సృష్టించిన మారణకాండను గుర్తుచేసుకొని ఘటనలో మృతిచెందిన వారికి నిల్చుని కాసేపు మౌనం పాటించి నివాళులర్పించారు.
¬లాండేతో సమావేశమైన మోదీ
హైదరాబాద్: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ ¬లాండేతో భారత ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. పారిస్‌లో జరుగుతున్న అంతర్జాతీయ వాతావరణ సదస్సు జరుగుతున్న నేపథ్యంలో పారిస్‌కు వెళ్లిన మోదీ ¬లాండేతో బ’ాటీ అయ్యారు. వాతావరణ మార్పులపై చర్చించాల్సిన పలు అంశాల గురించి మాట్లాడారు. వాతావరణ మార్పులకు సంబంధించి భారత్ నిర్మాణాత్మాక విధానాలు, గొప్ప లక్ష్యాలతో సదస్సులో ముందుకెళ్తుందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ¬లాండేతో మోదీ సమావేశమైన ఫొటోలను స్వరూప్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.