వామ్మో ! మంత్రి ఇంట్లో

ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం
కోహిమా, ఫిబ్రవరి 18 (జనంసాక్షి):
ఎన్నికలు జరగనున్న నాగాలాండ్‌లో అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ఎన్నికల్లో ఉపయోగించుకునేందుకు అక్రమంగా తరలిస్తున్న నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. తాజాగా నాగాలాండ్‌హోంమంత్రి హిన్‌కాండ్‌ ఎల్‌ ఇచన్‌ వద్ద భారీగా పేలుడు పదార్థాలు, ఆయుధాలు, నగదు లభించడంతో పలువురు ఆశ్చర్యపోతున్నారు. కుహిమా నుంచి హోంమంత్రి సొంత నియోజకవర్గానికి వెళుతుండగా ఆయన వాహనాలను సోమవారం భద్రతా దళాలు తనిఖీలు చేశాయి. ఈ తనిఖీల్లో లభించిన వస్తువులను చూసి
పోలీసుల అదుపులో నాగాలాండ్‌ హోంమంత్రిఅధికారులు నోరెళ్లబెట్టారు. కొహిమా భారీ నగదుతో పాటు పేలుడు పదార్థాలు, ఆయుధాలు లభించాయి. దీంతో అతనిని అదుపులోకి తీసుకున్నాయి. స్థానిక పోలీసులకు భద్రతాదళాలు అప్పగించాయి. హోంమంత్రిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సాక్షాత్తూ హోంమంత్రి నుంచే ఇలా ఆయుధాలు.. అక్రమంగా నగదు, పేలుడు పదార్థాలు లభించడం పట్ల అధికారులు, ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల హెలికాప్టర్లలో అక్రమంగా కోటి రూపాయలు తరలిస్తుండగా ఈసీ ప్రత్యేక అధికారుల బృందం దానికి పట్టుకుని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.