వారణాసి నుంచి సోనియా శంఖారావం
– ఆగస్టు 2న ప్రారంభం
వారణాసి,జులై 31(జనంసాక్షి):వచ్చే ఏడాది జరిగే ఉత్తర్‌ప్రదేశ్ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సమర శంఖారావం పూరిస్తోంది. ఆగస్టు 2న కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ప్రధాని నరేంద్రమోదీ నియోజకవర్గమైన వారణాసిలో రోడ్‌షో చేపట్టనున్నారు. ఎనిమిది కిలోవిూటర్ల వరకు నిర్వహించే ఈ ప్రదర్శనలో వేలాది మంది పార్టీ కార్యకర్తలు, మద్దతు దారులు పాల్గొంటారని వారణాసి జిల్లా యూనిట్ అధ్యక్షుడు ప్రజానాథ్ శర్మ అన్నారు.రహదారి ప్రదర్శనలో భాగంగా మహాత్మ గాంధీ, రాజీవ్ గాంధీ, సర్దార్ పటేల్, ఇంగ్లిష్‌యలైన్ వద్ద పండిట్ కమల పటి త్రిపాఠి విగ్రహాలను ఆవిష్కరించి ప్రసంగిస్తారు. ఈ ప్రదర్శనలో ముఖ్యమంత్రి అభ్యర్థి షీలా దీక్షిత్, పార్టీ సీనియర్ నేత గులామ్‌నబీ ఆజాద్ పాల్గొనున్నారు. ప్రధాని మోదీ హావిూ ఇచ్చిన స్వచ్ఛ గంగ, నిత్యావసర ధరల పెరుగుదల, అభివృద్ధి అంశాలపై సోనియా ప్రసంగిస్తారు.