వారసత్వ భూమిని కబ్జా చేశారంటూ తప్పుడు ఆరోపణలు సరికావు

బచ్చలి మల్లయ్య

తొర్రూర్  18అక్టోబర్ (జనంసాక్షి )
తన వారసత్వ భూమిని కబ్జా చేశారని పత్రికలో తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని బచ్చలి మల్లయ్య అన్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి.
గ్రామం కానాపురం మండలం తొర్రూర్ జిల్లా మహబూబాబాద్  భూమి సర్వే నెంబర్40/5/2 ముంజంలో 35 గుంటల భూమి కలదని,గత 1983 నుండి రికార్డు కలిగి ఉన్నామని. ప్రస్తుతం  బచ్చలి సోమయ్య తండ్రి పేరు  రామయ్య అనే వ్యక్తి  భూమికి సంబంధించిన తప్పుడు పత్రాలను రెవిన్యూ అధికారులకు ఇచ్చి 20 గుంటల భూమిని అక్రమంగా తన పేరు మీదికి2009-2010  మార్పిడి చేసుకోవడం జరిగిందని , ఈ విషయంలో ఒరిజినల్ డాక్యుమెంట్స్ తో సంబంధిత రెవిన్యూ అధికారులకు మేము ఫిర్యాదు చేశామని బచ్చలి మల్లయ్య తెలిపారు. ఈ అంశంపై సంబంధిత రెవిన్యూ అధికారులు పూర్తి విచారణ జరిపి బచ్చలి సోమయ్య తండ్రి పేరు రామయ్య అనే వ్యక్తి ది తప్పుడు పట్టా అని ధ్రువీకరించడం జరిగింది. అట్టి భూమి బచ్చలి సోమయ్య తండ్రి పేరు వెంకయ్యకు చెందిందని రెవిన్యూ అధికారుల నిర్ధారించడం జరిగింది. బచ్చలి మల్లయ్య తండ్రి పేరు వెంకయ్యకు బదులుగా రామయ్య పడడం జరిగిందని ఇది రెవెన్యూ అధికారులు తప్పదం మూలంగా జరిగిందని వారు తెలిపారు. అయినా కూడా తప్పుడు డాక్యుమెంట్లు చూపించుకుంటూ అటు రెవెన్యూ అధికారులను భూమి హక్కు దారినైన నన్ను బ్లాక్ మెయిల్ చేస్తూ తప్పుడు ప్రకటనలు పత్రికలలో చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నాపై తప్పుడు ప్రకటనలు చేస్తున్న బచ్చలి సోమయ్య తండ్రి పేరు రామయ్య అనే వ్యక్తిపై రెవిన్యూ అధికారులు  చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.
Sent from Email.Avn for mobile