వార్డెన్ లు పిల్లల ను కంటికి రెప్పలా చుసుకోవాలి

ఆడ్వేజరి మీటింగ్ లో  ఎమ్మెల్యే జాజల సురేందర్
ఎల్లారెడ్డి  23 జులై  (జనంసాక్షి ) ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని మండలాల వారీగా ఉన్న ప్రభుత్వ ఎస్సీ,ఎస్టీ,బిసి హాస్టల్స్ అడ్వైజరీ కమిటీ సమావేశం ఎల్లారెడ్డి శాసన సభ్యులు  జాజాల సురేందర్ గారి అధ్యక్షతన ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం నిర్వహించారు .హాజరైన జిల్లా,డివిజన్ స్థాయి అధికారులు ప్రభుత్వ హాస్టల్స్ లో ప్రస్తుతం వున్న విద్యార్థులు వివరాలు మరియు ఖాళీగా వున్న సీట్ల వివరాలను ఎమ్మెల్యే గారికి వివరించారు  ఈ సందర్భంగా ఎమ్మెల్యే  జాజల మాట్లాడుతూ….నియోజకవర్గంలోని ప్రభుత్వ హాస్టల్స్ లో విధులు నిర్వహిస్తున్న హాస్టల్ వార్డెన్ లు తమ తమ హాస్టల్లోని విద్యార్థులను తమ స్వంత పిల్లల్లా భావించి విధులు నిర్వహించాలని, పూర్తి అంకిత భావంతో మరియు ఆత్మ సంతృప్తితో పని చేయాలని అన్నారు. వార్డెన్లు సంపూర్ణ సేవా దృక్పథంతో పని చేయడం వలన ఇంకా మంచి ఫలితాలు సాధించవచ్చని, విద్యార్థులకు మంచి భవిష్యత్తు అందించాలని తెలిపారు. హాస్టల్స్ లో ఉన్న పరిస్థితుల గురించి స్థానిక ప్రజాప్రతినిధులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని  సూచించారు .అడ్వైజరీ కమిటీ అన్ని వివరాలు చర్చించిన పిదప సంబంధిత ప్రతిపాదనలను ఆమోదించినట్లు తెలిపారు  ఈ
కార్యక్రమ అనంతరం ఎల్లారెడ్డి మండలం భిక్నూర్ గ్రామ నివాసి అయిన చాకలి పల్లవి ఎల్లారెడ్డి ఎస్సీ బాలికల వసతి గృహంలో వుంటూ 10వ తరగతి పరీక్షల్లో ( జి పి ఏ 9.8) ఉత్తమ ప్రతిభ కనపరచినంధుకు గాను శాలువాతో సన్మానించారు.అదేవిధంగా  ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులు గల వసతి గృహాల వార్డెన్ లను కూడా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మునిసిపల్ చైర్మన్, కూడుముల సత్యం  నియోజకవర్గ ఎంపీపీ లు, జెడ్పీటీసీ లు, తాసిల్దార్లు, ఎంపిడిఓ లు, జిల్లా ఎస్సీ,బిసి,ఎస్టీ హాస్టల్ అధికారులతో పాటు నియోజకవర్గంలోని ప్రభుత్వ ఎస్సీ,ఎస్టీ,బిసి హాస్టల్స్ వార్డెన్లు పాల్గొన్నారు.
Attachments area