వార్త పత్రికల్లో వచ్చిన కథనాలు పూర్తిగా అవాస్తవం

మేళ్లచెరువు మండలం (జనం సాక్షి న్యూస్)

వివిధ వార్త పత్రికల్లో నాలుగు రోజులుగా మై హోమ్ సిమెంట్ 4వ ప్లాంట్  పై వస్తున్న కథనాలు పూర్తిగా అవాస్తవమని ప్లాంట్ మేనేజర్ నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం కర్మాగారంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీడియా లో వస్తున్న వార్తలను పూర్తిగా ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు.నియమ నిబంధనలను తాము ఉల్లంఘించలేదని ఆయన తెలిపారు.సర్వే నంబర్1057 లో కర్మాగారం తరుపున కొంత భూమిని కొన్నామని దానికి సంబంధించిన పూర్తి దస్తా వేజులు ఉన్నాయని అన్నారు.మీడియా ప్రతినిధులు ప్రచురిస్తున్న కథనాలలో ఎలాంటి వాస్తవం లేదన్నారు.ఉద్దేశ్యపూర్వకంగానే సంస్థ పరపతిని ఇబ్బంది పెట్టేలా ఉన్నాయన్నారు. రెవెన్యూ శాఖ నుండి ఎలాంటి నోటీసులు రాలేదన్నారు.దయ చేసి సంస్థపై నిరాధార కథనాలు ప్రచురించవద్దని మీడియా ప్రతినిధులను ఆయన కోరారు