వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలి

వాల్మీకి బోయ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ డిమాండ్

ఆగస్టు 4న మండల కేంద్రాల్లో ధర్నా విజయవంతం చేయండి

మక్తల్ జూలై 30 (జనంసాక్షి) తెలంగాణ రాష్ట్రం లోని వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని వాల్మీకి బోయ సంఘాల ఐక్య కార్యచరణ కమిటీ సభ్యులు గద్వాల వైన్డింగ్ రాములు, మండ్ల రామకృష్ణ డిమాండ్ చేశారు. శనివారం మక్తల్ పట్టణంలోని రోడ్డు భవనాల శాఖ అతిథిగృహంలో నిర్వహించిన సమావేశంలో ఆగస్టు 4న రాష్ట్రవ్యాప్తంగా వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేపట్టనున్న ధర్నా కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేరుస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.చల్లప్ప కమీషన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి వాల్మీకి బోయల స్థితిగతులను పరశీలించి వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలోకి మార్చాలని నివేదిక సమర్పించడం జరిగిందని అన్నారు. అసెంబ్లీలో వాల్మీకి బోయలను ఎస్టిలో చేర్చాలని తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపినట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం అలాంటి లేఖ ఏది తమ వద్దకు రాలేదని చెబుతుందన్నారు. దశాబ్దల కాలంగా వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేరుస్తామంటూ పాలక ప్రభుత్వాలు ఓటు బ్యాంకుగా వినియోగించుకుంటున్నాయి తప్ప ఎస్టీ జాబితాలో చేర్చడం లేదని అన్నారు.అడవిబిడ్డలు వాల్మీకి బోయలు ఎస్టీలు కాక మరెవరని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో వాల్మీకి బోయలు ఎస్టీలు గాను ఎస్సీలు గాను గుర్తించబడ్డారని అన్నారు. పక్కనే ఉన్న కర్ణాటక మహారాష్ట్రలోనూ వాల్మీకి బోయలను అక్కడి ప్రభుత్వాలు ఎస్టీలుగా గుర్తించాయన్నారు .రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఏజెన్సీ ప్రాంతాల్లోని వాల్మీకి బోయలను ఎస్టీ లుగాను మైదాన ప్రాంతాల్లోని వాల్మీకి బోయలను బీసీలుగాను గుర్తించడం అన్యాయమని అన్నారు. ఒక కులాన్ని ఎస్టీలుగా బీసీలుగా రెండు విధాలుగా గుర్తించిన చరిత్ర ప్రపంచంలో ఎక్కడ ఉండదని అన్నారు .ఇప్పటికైనా ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీ మేరకు వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని వారు డిమాండ్ చేశారు .వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలనె డిమాండ్ తో ఆగస్టు 4న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో చేపట్టనున్న ధర్నా కార్యక్రమంలో వాల్మీకి బోయలంతా పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మక్తల్ మండల వాల్మీకి బోయ ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు బోయరవి, బి.అంజనేయులు సూర్య ,బి.చిన్న వెంకటేష్,బోయ వెంకటేష్ ,బి. రామకృష్ణ,గుడిసె అంజనేయులు, బి. శ్రీనివాసులు, బి. కళ్యాణ్ సాయిబాబా, శ్రీనివాసులు, వెంకటయ్య ,గుడిసె మహేష్ తదితరులు పాల్గొన్నారు.