వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలి.

జోగుల రాజేష్

మల్లాపూర్ (జనం సాక్షి) అక్టోబర్ :01 వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని తెలంగాణ రాష్ట్ర వాల్మీకి ఐక్యత జగిత్యాల జిల్లావాల్మీకి ఐక్య కార్యాచరణ స్టీరింగ్ సభ్యులు జోగులరాజేష్ అన్నారు. అలాగే. బోయల అదిగురువు, రామాయణ గ్రంథకర్త, ఆదికవి శ్రీ వాల్మీకి మహర్షి భవన్ ను హైదరాబాదులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకు నిర్మిస్తామని చెప్పారు. మహర్షి శ్రీ వాల్మీకి భవన్ ను హైదరాబాదులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 25 నుండి 30 కోట్లతో నిర్మించి ఆ భవనంలో శ్రీ వాల్మీకి మహర్షి విగ్రహం తో గుడి ని నిర్మించాలని కోరుచున్నాము.  అలాగే ఇదివరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాల్మీకి బోయల స్థితిగతులను తెలుసుకొని వారిని ST జాబితా లో చేర్చుటకు ప్రభుత్వంచే నియమించిన చెల్లప్ప కమిషన్ నివేదిక ఆధారంగా వాల్మీకి బోయలను గిరిజన జాబితాలో చేర్చుటకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అట్టి నివేదికను కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖకు పంపాలని తెలంగాణ రాష్ట్ర వాల్మీకి బోయల తరపున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ను కోరుచున్నాము.ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా తెలంగాణ రాష్ట్ర వాల్మీకి ఐక్య కార్యచరణ స్టీరింగ్ కమిటీ సభ్యులు  కనుముల సంజీవ్, మీనుగు నరేష్, సుంచుల రాజు, అన్నపు గంగన్న, బోగె శ్రీనివాస్, మండ్ల రాజరెడ్డి లు పాల్గొన్నారు.