వాల్మార్ట్ దుకాణంలో అధికారుల తనిఖీలు
హైదరాబాద్: నగరంలోని అత్తాపూర్లో ఉన్న వాల్మార్ట్ దుకాణంలో తూనికలు, కొలతల శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఉత్పత్తులు, బరువు విషయంలో ఫిర్యాదులు రావడంతో అధికారులు సోదాలు చేపట్టారు. వాల్మార్ట్ దుకాణంలోని 25 సంస్థలకు చెందిన ఉత్పత్తులను అధికారులు జప్తు చేశారు.