వాహనదారులు తప్పనిసరి హెల్మెట్ ధరించాలి

మునగాల,జూలై21(జనంసాక్షి)
ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్‌ రక్షణగా నిలుస్తోందని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని మునగాల ఏ ఏస్ఐ కృష్ణమూర్తి అన్నారు. గురువారం స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద  హెల్మెట్‌ వల్ల కలిగే ఉపయోగాలపై ద్విచక్ర వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బైకుల మీద వెళ్తూ రోడ్డు ప్రమాదాలకు గురైన వారిలో అధిక శాతం మంది హెల్మెట్‌ ధరించకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. అందులో యువకులు ఎక్కువగా ఉంటున్నారని తెలిపారు. బైకు మీద రోడ్డు ఎక్కితే తప్పకుండా హెల్మెట్‌ ధరించాలన్నారు. హెల్మెట్‌ లేకుండా వెళ్తున్న వారికి జరిమానాలు విధిస్తామన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్‌ ధరించాలని చెబుతూ వారితో ప్రతిజ్ఞ చేయించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వాహనానికి సంబంధించిన పత్రాలు విధిగా కలిగి ఉండాలని సూచించారు.  ఈకార్యక్రమంలో పలువురు గ్రామస్తులు  పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Attachments area
 

తాజావార్తలు