విఆర్ఎల నిరవధిక సమ్మెకు మద్దతుతెలుపిన బీజేపీ
ఇల్లంతకుంట, జులై 30 (జనంసాక్షి )
ఇల్లంతకుంట మండల కేంద్రం లో తహసీల్దార్ కార్యాలయం ముందు గ్రామ సేవకుల నిరవధిక సమ్మె కు బీజేపీ నాయకులు మద్దత్తు తెలియజేసారు.ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు బెంద్రం తిరుపతిరెడ్డి మాట్లాడుతు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలనే గ్రామ సహాయలు అడగుతున్నారు అని అన్నాడు .తెలంగాణా రాష్టంలోని 22000 మంది గ్రామ సేవకులకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 2017 సంవత్సరం ప్రగతి భవన్ లో,2021సంవత్సరంలో అసెంబ్లీ సాక్షిగా పేస్కెల్ చేస్తామని మాట ఇచ్చిన కెసిఆర్ ఇప్పటికి పే స్కెల్ జీ.వో అమలుచేయకపోవడంతో చాలిచాలని జీతాలతో గ్రామా సేవకులైన విఆర్ఎలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరావేయుటలో వారధిలా పనిచేస్తు, గ్రామాలలో పంచాయతీ, రెవెన్యూ, పోలీస్, విద్యుత్, నీటిపారుదల,అన్నీ శాఖల అధికారులకు చేదోడువాడోడుగా సేవాలాందిస్తున్న విఆర్ పే స్కెల్ జీ.వోను వెంటనే అమలుచేయాలిని డిమాండ్ చేశారు. అర్హత వున్నా విఆర్ఏ ల అందరికి పదోన్నతి కల్పించాలి డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో విఆర్ఏ లు బీజేపీ నాయకులు గజ్జల. శ్రీనివాస్, బత్తిని.స్వామి, బండారి.రాజు, మామిడి. హరీష్, వజ్జపెల్లి.శ్రీకాంత్,బొల్లారం. ప్రసన్న,వెల్డింగ్.చంద్రం,కుంటాల.సాయి తదితరులు పాలుగోన్నారు.