విఆర్ఏల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి
స్టేషన్ ఘన్పూర్, జూలై 29 ,( జనం సాక్షి) : విఆర్ఏల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందిం చి తమకు న్యాయంచేయాలని వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షుడు పాలేపు శ్రీనివాస్, ప్రదాన కార్యదర్శి ఎలిశాల రాము కోరారు. విఆర్ఏలకు ఇచ్చిన హామీమేరకు విఆర్ఏల సమస్యలు వెంట నే పరిష్కరించాలని తహసీల్దారు కార్యాలయం ముందు విఆర్ఏలు చేపట్టిన సమ్మె ఐదవ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా విఆర్ఏలు నోటికి నల్ల రిబ్బన్ లు కట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా విఆర్ఏల సంఘం మండల అధ్యక్షు డు పాలెపు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఎలిశాల రాము మాట్లాడుతు సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షి గా ఇచ్చిన హామీలను వెంటనే అమలుచేయలని కోరారు. విఆర్ఏలకు పేస్కెల్ జీఓను వెంటనే విడుదల చేయాలని,అర్వతకలిగిన విఆర్ఏలకు ప్రమోషన్స్ కల్పించాలని 55 సంవత్సర ములు నిండిన విఆర్ఏల స్థానంలో వారసులకు ఉద్యోగా లు కల్పించాలని అన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం మంచి మనస్సుతో విఆర్ఏలకు ఇచ్చిన హామీలు పరిష్కరించాలని, లేని ఎడల హామీలు నెరవేర్చెవరకు సమ్మె కొనసాగిస్తామనీ అన్నారు.ఈకార్యక్రమంలో అధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధానకార్యదర్శి రాము, కోశాధికారి శివ,రమ్య, జ్యోతి, యాదేశ్,అభి, సృజన్, పోతరాజు, అశోక్, పోషయ్య, నాగ రాజు, బాషబోయిన రాజు, రాజే శ్వరి, సంపత్, తదితరులు పాల్గొన్నారు.