విఆర్ఏల సమ్మెకు మద్దతు తెలిపిన కాంగ్రెస్, బిజెపి

జుక్కల్, జూలై27,జనం సాక్షి,
కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండల కేంద్రంలో ని తహాసీల్ కార్యాలయం ఎదుట గత మూడురోజులుగా కొనసాగుతున్న విఆర్ఏల నిరవధిక సమ్మెకు బుధవారం బిజెపి,కాంగ్రెస్ నాయకులు విడివిడిగా కలిసి మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతు తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విఆర్ఏ లకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
అర్హులైన విఆర్ఏ లకు పదోన్నతులు కల్పించాలని, వయసు మీరిన వారి స్థానంలో వారసులకు అవకాశం కల్పించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. విఆర్ ఎలకు పేస్కెల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభత్వం విఆర్ఏల డిమాండ్లను నెరవేర్చక పోతే తమ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక నెరవేర్చుతామని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి
జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, కామారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షురాలు,మాజి ఎమ్మెల్యే అరుణ తార, కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే సౌదాగర్ గంగారాం లు పాల్గొన్నారు.