వికలాంగుల హక్కులను అమలుచేయాలి

వి.హెచ్.పి.యస్ రాష్ట్రఅధ్యక్షులు కాశీం
మునుగోడు అక్టోబర్20(జనంసాక్షి)
వికలాంగుల పోరాట సమితి నల్గొండ జిల్లా కార్యవర్గ సమావేశం శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం ఖాసిం హాజరై మాట్లాడుతూ వికలాంగుల ఆసరా పింఛన్ 3016 నుండి 6000 రూపాయలకు పెంచాలి వికలాంగుల సంక్షేమ శాఖను స్వతంత్ర శాఖ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.రాష్ట్రంలో వికలాంగులపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం అరికట్టాలి అదేవిధంగా వికలాంగుల పెన్షన్ ఏరువేతను జీవో నెంబర్ 17ను ఉపసంహరించుకోవాలని కోరారు.నవంబర్ 26న వికలాంగుల పోరాట దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో జరిగే విలాంగుల భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో రాష్ట్రకార్యదర్శి గుద్దేటి సైదులు,రాష్ట్రఉపాధ్యక్షులు వెంకట్ చారి,బర్రి శంకర్,జిల్లాఉపాధ్యక్షుడు మహేష్, కార్యదర్శి వంగూరు రవి,మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జి మేడి యాదయ్య, శ్రీశైలం,లక్ష్మి,మంగా,నీలమ్మ,సరిత తదితరులు పాల్గొన్నారు.