వికారాబాద్ జిల్లా బీసీ మహిళా అధ్యక్షురాలిగా మధులత శ్రీనివాస్ చారి.
జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య చేతుల మీదగా నియామకపత్రం అందజేత.
జాతీయ కార్యవర్గ సభ్యులు బీసీ సంఘం కన్వీనర్ రాజ్కుమార్ కందుకూరి.
తాండూరు సెప్టెంబర్ 21(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా బీసీ మహిళా అధ్యక్షురాలిగా మధులత శ్రీనివాస్ చారి.జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య చేతుల మీదగా నియామకపత్రం అందజేశారు.ఈ సందర్భంగా మధులత శ్రీనివాస్ చారి మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి జిల్లా అధ్యక్షురాలిగా నియమించినందుకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కు జాతీయ కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ కు బీసీ సంఘం రాష్ట్ర కన్వీనర్ లాల్ కృష్ణప్రసాద్ కు రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ షుకూర్ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు యాదగిరి యాదవ్ లకు ధన్యవాదములు తెలిపారు .రాబోవు రోజుల్లో బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం శ్రమిస్తున్నని జాతీయస్థాయిలో ఏ పిలుపు ఇచ్చిన తన వంతు బాధ్యతగా వికారాబాద్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున మహిళల భాగస్వా మ్యం ఉంటుందని అన్నారు. అదేవిధంగా వికారాబాద్ జిల్లా అన్ని మండలాలకు త్వరలోనే బీసీ మహిళా సంఘాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు తాండూర్ నియోజకవర్గ కన్వీనర్ రాజ్కుమార్ మాట్లాడుతూ జిల్లా స్థాయి పదవి తాండూర్ కి కేటాయించినందుకు ఆర్ కృష్ణయ్య కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.