వికారుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌పై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ సీరియస్‌

1

-అధికార హత్యలా ఉంది

– గాయాలైన పోలీసులను ప్రవేశపెట్టండి

-చేతులకు బేడీలున్నవారు తుపాలు లాక్కునే యత్నం ఎలా చేశారు?

-శేషాచలం ఎన్‌కౌంటర్‌పై జ్యుడీషియల్‌ విచారణ ఎందుకు చేపట్టలేదు.

హైదరాబాద్‌  ఏప్రిల్‌ 23 (జనంసాక్షి):

వికారుద్దీన్‌తో సహా మరో నలుగురు  ఎన్‌కౌంటర్‌పై జాతీయ మానవ హక్కుల సంఘం నేడు బహిరంగ విచారణ ప్రారంభించింది. నగరంలోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జరాగిన బమిరంగ విచారణలో ఎన్‌హెచ్‌ఆర్సీ పోలీసులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.పోలీసులు కాల్పుల్లో మరణించింన తర్వాత ప్రతికారం తీర్చుకునేందుకు అధికార హత్యలా ఉందని వ్యాఖ్యానించింది.  చేతులకు బేడీలు ఉన్నవారు తుపాకులు ఎలా లాక్కునే ప్రయత్నం చేశారని, గాయాలైన పోలీసుల వివరాలు వెల్లడించాలని కోరింది. మృతులపై  తీవ్రమైన నేరారోపణలు ఉన్నప్పుడు హైదరాబాద్‌ నుంచి వరంగల్‌ జైలుకు ఎందుకు తరలించారని ప్రశ్నించింది.    ఏప్రిల్‌ 7న జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో వికారుద్దీన్‌కు చెందిన ఐదుగురు వ్యక్తులు మృతిచెందిన సంగతి తెలిసిందే. విచారణ నిమిత్తం కోర్టుకు తరలిస్తుండగా వికారుద్దీన్‌ ముఠా తమపై దాడికి ప్రయత్నించిందని, ఆయుధాలు లాక్కోవడానికి ప్రయత్నించడంతో తాము కాల్పులు జరిపామని తెలంగాణ రాష్ట్ర పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు సమాదానంపై కమీషన్‌    అసంతృప్తి వ్యక్తం చేస్తు సమగ్ర నివేదిక సమర్పించాలని కోరింది.

శేషాచలం ఎన్‌ కౌంటర్‌ పై ఎన్‌.హెచ్‌.ఆర్‌.సి ఆగ్రహం

ఏపీ ప్రభుత్వంపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. శేషాచలం ఎన్‌ కౌంటర్‌ పై జ్యుడీషియల్‌ ఎంక్వైరీ ఎందుకు వేయలేదని ప్రశ్నించింది. ఎన్‌ కౌంటర్‌ లో పాల్గొన్న పోలీసుల వివరాలతో పాటు.. వారు ఉపయోగించిన సెల్‌ నంబర్లు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే, ఎన్‌ కౌంటర్‌ జరిగిన ప్రాంతానికి సవిూపంలోని సెల్‌ టవర్ల నుంచి వెళ్లిన అన్ని ఫోన్‌ కాల్స్‌ వివరాలను సమర్పించాలని చెప్పింది.  ఎన్‌ కౌంటర్‌ పై ఏపీ ప్రభుత్వం తరఫున అడిషనల్‌ డీజీ (లీగల్‌ ఎఫైర్స్‌) వినయ్‌ రంజన్‌ ఎన్‌.హెచ్‌.ఆర్‌.సి బృందానికి నివేదిక సమర్పించారు.