వికారుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌పై లోక్‌సభలో ప్రస్తావించిన ఓవైసీ

2

న్యూఢిల్లీ,ఏప్రిల్‌28

జనంసాక్షి)

విచారణ ఖైదీల ఎన్‌కౌంటర్‌కు దారితీసిన పరిస్థితులపై ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం ద్వారా విచారణ జరిపిస్తోందని కేంద్ర ¬ం శాఖ సహాయ మంత్రి కిరణ్‌ రిజ్జు చెప్పారు.  తెలంగాణలో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన వివరాలపై ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ లోక్‌సభలో మంగళవారం అడిగిన ప్రశ్నకు మంత్రి కిరణ్‌ రిజ్జు లిఖితపూర్వకంగా బదులిచ్చారు. ఐదుగురు విచారణ ఖైదీలను కోర్టుకు తీసుకెళ్తుండగా ఎస్కార్ట్‌ పోలీసుల నుంచి ఆయుధాలను లాక్కొని కాల్పులు జరిపారని తెలిపారు.  పోలీసులు ఆత్మరక్షణ కోసం ఎదురుకాల్పులు జరపగా ఐదుగురు ఖైదీలు చనిపోయారని తెలంగాణ డీజీపీ సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు.ఎదురుకాల్పుల ఘటనపై ఆలేరు పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయ్యిందని తెలిపారు. ఖైదీలు 10కి పైగా కేసుల్లో నిందితులుగా ఉన్నారని వివరించారు. ఈ ఎన్‌కౌంటర్‌పై జాతీయ మానవహక్కుల కమిషన్‌ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక కోరింది.  ఆ ప్రక్రియలోభాగంగా తెలంగాణ ప్రభుత్వం నివేదికను జాతీయ మానవహక్కుల కమిషన్‌కు అందచేయాల్సి ఉంటుందని మంత్రి కిరణ్‌ రిజ్జు బదులిచ్చారు.