విగ్రహ ప్రతిష్టాపనకు విరాళం అందజేత
తొర్రూర్ 16 అక్టోబర్ (జనంసాక్షి )పట్టణ కేంద్రానికి చెందిన కిన్నెర బృందావనం వారి కుమారులు కిన్నెర వెంకటేష్, కిన్నెర తిరుపతి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో లక్ష్మి సరస్వతి గాయత్రి అమ్మవారి గుడిలో నూతన ఆంజనేయస్వామి విగ్రహం, ప్రవేశ ముఖద్వారం కోసం విరాళం అందజేశారు.ఈ మేరకు ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టాపనకు, ప్రవేశ ముఖద్వారం కోసం ₹55000/యాభై ఐదువేల రూపాయల విరాళాన్ని కమిటీ గుడి ధర్మ కర్త బొనగిరి నరసింహులకు అందజేశారు.ఈసందర్భంగా కమిటీ సభ్యులు విగ్రహ ప్రతిష్ఠ దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు.అనంతరం కిన్నెర వెంకటేష్ మాట్లాడుతూ…తన తండ్రి కీర్తిశేషులు కిన్నెర అబ్బులు కృష్ణ జ్ఞాపకార్ధంగా విగ్రహ ప్రతిష్టాపనకు నగదు అందిచండం అదృష్టం గా భావిస్తున్నట్లు తెలిపారు. గాయత్రి అమ్మ వారి ఆశీస్సులతో ప్రజలందరికీ శుభం జరగాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.
ఈ కార్యక్రమంలో తనుష్, పవన్ కృష్ణ,నితిన్ కృష్ణ, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.