విచారణలు.. విషాదాలు

‘సల్వాజుడుం’ అని పిలువబడే సంస్థ లేక ఉద్యమం లేక రౌడీమూక చత్తీస్‌గడ్‌ ప్రభుత్వం అండదండలతో నిరాయుధు లైన ప్రజల మీద హింసకు పాల్పడుతున్నదన్న అభియోగంపై న విచారణ జరిపి నివేదిక ఇమ్మని జాతీయ మానవహక్కుల కమిషన్‌ను సుప్రీం కోర్టు ఆదేశించటం చాలా మందికి సం తోషం కలిగించింది. సంతోషించడంలో ఆక్షేపించడానికి లే దుగానీ, ఎవరిమీదనయితే విచారణ జరపబోతున్నారో వారు దాన్ని సాగనివ్వరనీ, ఏ ప్రభుత్వం అండదండలతో వాళ్లు య థేచ్చగా హింసకు పాల్పడుతున్నారన్న అభియోగాన్ని కమిష న్‌ విచారించబోతున్నదో ఆ ప్రభుత్వం అండదండలతో అడ్డు పడుబోతారనీ నిస్సకోచంగా చెప్పవచ్చు.
విచారణ వస్తువే విచారణ ప్రక్రియకు ఆటంకమయితే వి చారణ కమిషన్‌ ఏం తేల్చగలుగుతుంది? దాదాసు 14 ఏళ్ల కింద ఇదే జాతీయ మానవహక్కుల కమిషన్‌ ఆంధ్రప్రదేశ్‌లో ఒక విచారణ కోసం తరలివచ్చింది. పోలీసులు ఎన్‌కౌంటర్ల పేరిట హత్యలకు పాల్పడుతన్నారన్న అభియోగాన్ని విచారణ కు స్వీకరించాక ఈ విషయంలో ప్రజలేమనుకుంటున్నారో తెలుసుకోవడానికి అది బయలుదేరి వచ్చింది. వచ్చినవాళ్లు చిన్నాచితక మనుషులు కారు. సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఒకరు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఒక రు, ఇద్దరు హైకోర్టు మాజీ న్యాయమూర్తులు, ఒక రిటైర్డ్‌ కేం ద్ర ప్రభుత్వ అధికారీ వచ్చారు.
కరీంనగర్‌, వరంగల్‌, నల్లగొండలలో విచారణ నిర్వ హించారు. వారికి తెలిసిన ఏకైక పద్దతిలో నిర్వహించారు. ఒ క ప్రభుత్వ అతిథి గృహాన్ని విచారణ కేంద్రంగా ఎం చుకున్నారు. ఫలానే తేది పొద్దున్న 10 గంటల నుంచి ఫలాన చోట విచారణ జరుగుతుందనీ ప్రజలెవరైనా వచ్చి ఎన్‌కౌం టర్ల విషయంలో గానీ మొత్తంగా నక్సలైట్‌ ఉద్యమం, ప్రభు త్వ చర్యలు అనే అంశాల మీదుగా చెప్పవలసిందేమైనా ఉంటే చెప్పవచ్చునని పత్రికా ప్రకటన ఇచ్చారు. మేము మూడు జిల్లాలోనూ ఎన్‌కౌంటర్‌ మృతుల కుటుంబాలను ఒక జీపులో ప ట్టేంత మందిని సమీకరించి తీసుకుపో యాము. అంతకంటే మాకు స్తోమతాలే దు. బాధితుల కదలికా లేదు.
ఒక్క కరీంనగర్‌లో మాత్రం విచారణకు సక్రమంగా జరి గింది. అంటే పోలీసుల జోక్యం చేసుకోలేదు. మేము విచార ణ స్థలానికి పోగానే కరీంనగర్‌ డీఎస్పీ వచ్చి కరచాలనం చేసి ఇది మీరోజు, మాజోక్యం ‘ఉండదు’ అన్నాడు. మేము తీసు కోచ్చిన పోలీసు బాధితులు చెప్పవలసింది చెప్పారు. నక్సలైట్‌ బాధితులు కూడ కొందరొచ్చి వాళ్లు చెప్పవలసిందీ చెప్పారు. మమ్మల్పి ఒకటి రెండు సూటిపోటి మాటలన్నారుగానీ అ ల్లరం జరగలేదు. మరుసటి రోజు వరంగల్‌లో విచారణ జ రగవలసిన చింతగట్టు గెస్ట్‌హౌస్‌లో మేము వెళ్లే సరికి అప్పటి కే చాలా పెద్ద గుంపు పోగయి ఉంది. మేము చూస్తూ ఉండ గానే గుంపు ఇంకా పెద్దదయింది.
అది మమ్మల్ని అల్లరి పెట్టాడానికి పోలీసులు పోగుచేసిన గుంపని అర్థంఅయింది. మేము కమిషన్‌కు ఫిర్యాదు చేయడా నికి గెస్ట్‌హౌస్‌ లోపలికి వెళ్లి విజటర్స్‌ రూంలో కూర్చున్నా ము. అయితే ఈ నాటకానికి డైరెక్టర్‌ అయిన అప్పటి వరంగ ల్‌ ఓఎస్డీ ఉమేష్‌చంద్ర వచ్చి ఇది మీరు కూర్చోవలసిన చోటు కాదు. బయటకు వెళ్లండి అన్నాడు తాను పోగుచేసిన గుంపు చేత దెబ్బలు తినకుండ మేము తప్పించుకుంటామేనని అతని ఆదుర్దా. కొంతసేపటికి కమిషన్‌ తన విచారణ మొదలు పె ట్టింది. మేము తీసుకొచ్చిన పోలీసు బాధితులు కొంచెం చె ప్పారు. అంతలో పోలీసులు తెచ్చిన గుంపు దాడికి దిగారు. మాపైన చేయిచేసుకున్నారు. అక్కడున్న పోలీసులు చోద్యం చూస్తూ నిలబడ్డారు.
కొంచెం సేపటికి మానవహక్కుల కమిషన్‌ పెద్దలు జో క్యం చేసుకుని అందరినీ శాంతంగా ఉండవలిసిందిగా కోరుతూ మాట్లాడారు. ఆ తరువాత సద్దుమణిగిందిగానీ పో లీసు బాధితులెవ్వరూ అక్కడ మిగలలేదు. నక్సలైట్‌ బాధితు లు మాత్రం మిగిలారు. కమిషన్‌ వారి వాంగ్మూలాలు స్వీక రించి విచారణ ముగించింది. పోలీసుల లక్ష్యం నెరవేరింది. మరుసటి దినం నల్లగొండలోనూ అదే జరిగింది. మాకు హాని జరగగలదని భయపడి కణ్ణభిరాన్‌ స్వయంగా రాగా ఆ యన పై కూడా చేయిచేసుకున్నారు. రేపు సుప్రీంకోర్టు ఆదేశం మేరుకు జాతీయ మానవహక్కుల కమిషన్‌ చత్తీష్‌గడ్‌లో చే పట్టబోయే విచారణ ఇంతంటే కూడ ఏకపక్షంగా ముగియ గలదు. దానికి రెండు కారణాలున్నాయి. ఇక్కడ నిరంతరా యంగా ప్రజలహక్కుల కోసం పనిచేస్తున్న వాళ్లమున్నాము. ఆనాడు జాతీయ మానవహక్కుల కమిషన్‌ను రప్పించగ లిగా ము, స్తోమత ఉన్న మేరకు బాధితులను తీసుకపోగలిగాము.
అటువంటప్పుడు అది నేరం ఎట్లాగైంది ? ఒక వేళ అ యిందునుకున్నా జిల్లా కోర్టు నుంచి సుప్రీంకోర్టుదాకా అన్ని న్యాయస్థానాలలోనూ ఒక సంవత్సర కాలం బెయిల్‌ నిరాక రించవలసిన అవసరం ఎముంది? అజయ్‌ మీద కేసు మరీ అన్యాయమైనది. అతను 2004 ఎన్నికలప్పుడు పరీశీలన ని మిత్తం తిరుగుతుండగా మావోయిస్టు సానుభూపతిపరులు అ తనిని పోలీసు ఏజెంట్‌గా అనుమానించి, నిర్బంధించి కెమెరా గుంజుకున్నారు. ఆ కెమెరా తిరిగి ఇప్పించమని అతను మావోయిస్టు నాయకత్వానికి రాసిన ఉత్తరాన్ని స్వాధీనం చేసు కున్న పోలీసులు, మావోయిస్టులతో సంబంధాలున్నాయని అ జయ్‌ పైన కేసు పెట్టారు.
పాపం అతనికి బెయిల్‌ దొరకడానికి ఎంతకాలం పడు తుందో ? ఒక పక్క పరిస్థితి ఇది కాగా రెండవ పక్క పోలీసు లు ఇక్కడ లాగా అక్కడ కొత్తగా నక్సలైట్‌ వ్యతిరేక గుంపును పోగు చేయనక్కలేదు. సల్వాజుడుం ఇప్పటికే తయారైవుంది. వాళ్ల చర్యల గురించే జాతీయ మానవహక్కుల కమిషన్‌ రేపు విచారణ చేపట్టబోయేది. కోర్టు విచారణను కాదు కదా, వారి కి ఏ ప్రమాదమూ కలిగించబోని జర్నలిస్టులు, హక్కుల సం ఘాల వాళ్ల విషయసేకరణను కూడ వారెన్నడూ సహించలే దు. సహించక పోవడం అంటే ఊరికే అభ్యంతరం చెప్పడం కాదు. మీద పడికొడతారు, నిర్బంధించి కెమెరాలూ పుస్తకా లూ గుంజుకుంటారు వెంబడించి తరిమేస్తారు.
ఖమ్మం జిల్లాకు చెందిన తెలుగు మీడియా ప్రతినిధులు ఈ చేదు అనుభవాన్ని చాలా సార్లు రుచి చూశారు. అయిన ప్పటికీ సుప్రీం కోర్టు ఆదేశించిన విచారణ సక్రమంగా జరిగే టట్టు చూడడం చాలా అవసరం మావోయిస్టుల ప్రభావాన్ని ఎదుర్కొనడానికి చట్టబద్ధమైన మార్గాలేవి అనుసరించడం సాధ్యం కాదునుకుంటున్న పాలకులు, మావోయిస్టు బాధితు లు, వ్యతిరేకులు పాల్పడే ప్రతీకార హింసకు చట్ట విరుద్ధంగా లైసెన్స్‌ ఇచ్చేస్తున్నారు. అది సల్వాజుడుం రూపంలో చత్తీస్‌గ ఢ్‌ ‘సఫలం’ అయిందని భావించడంతో జార్ఖండ్‌, ఒరిస్సా, మణిపూర్‌లోనూ అదే ప్రయత్నం మొదలయింది.
ఈ ఎత్తుగడ కేవలం ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచన కాదు. కేంద్ర హోం శాఖే తన 2005-06 నివేదికలో నక్సలైట్‌ ప్రభావం ఉన్న రాష్ట్రాల్లో స్థానిక ప్రతిఘటన దళాలనూ, గ్రామ రక్షక దళాలనూ ప్రోత్సహించాలని సలహా ఇచ్చినట్టు రాసుకుంది. సల్వాజుడుం ఓ మంచి ఉదాహరణ అని ప్రశంసించింది. సల్వాజుడుం స్వభావాన్ని బహిర్గతం చే యగల మానవహక్కుల కమిషన్‌ విచారణ సఫలమైతే ఈ అ క్రమానికి సుప్రీం కోర్టు అడ్డుకట్ట వేయగలదు. దీనికి మన రాష్టంలోకి పారిపోయి వచ్చిన చత్తీస్‌గఢ్‌వాసుల వాంగ్మూలా లు స్వీకరించాలి. ఇలా 30 వేల మంది వరకున్నారు.
వీరిలో ఎక్కువ భాగం ఖమ్మంలోనూ తక్కువగా వరంగల్‌ లోనూ తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుని బతుకుతు న్నారు. వాళ్లందరూ మావోయిస్టు అభిమానులు కారు గానీ మినహాయింపు లేకుండ అందరూ సల్వాజుడుం బాధితులే ర కరకాల భయాలు వారి మెదళ్లపైన పనిచేస్తున్న కారణంగా వారిలో చాలా మంది మాట్లాడకపోవచ్చు . కానీ చేస్తు కొ ద్ది మంది ముందుకొచ్చి విచారణలో పాల్గొంటారు. ఈ అవకా శం మానవహక్కుల కమిషన్‌ ఇవ్వకపోతే వారి విచారణ ఘో రంగా విఫలమయ్యే ప్రమాదముంది. అప్పుడు కేంద్ర ప్రభు త్వం దర్శకత్వంలో రాష్ట్రాలు అనుసరిస్తున్న వినాశనకరమైన వ్యూహం అప్రతిహతంగా వ్యాపించే ప్రమాదం ఉంది.
– కె.బాలగోపాల్‌