విజనరీ లీడర్ కేసిఆర్ వల్లే నేడు అత్యంత సేఫెస్ట్ సిటీగా హైదరాబాద్
ఇప్పుడు మన హైదరాబాద్ పెట్టుబడులకు స్వర్గదామం అయ్యింది
కెటిఆర్ SRDP ప్రోగ్రాం ద్వారా ఫ్లై ఓవర్లు,అండర్ పాస్లు నిర్మించి రోడ్ కనెక్టివిటీ పెంచారు
కేసిఆర్ హైదరాబాద్ తో పాటు తెలంగాణ రూరల్ ఎకానమీని గణనీయంగా పెంచారు
దీంతో ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది…రాష్ట్ర వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ విస్తరిస్తోంది
టిఎస్ బి పాస్ ద్వారా 21 రోజుల్లోనే భవన నిర్మాణ అనుమతులు లభిస్తున్నయి
2014లో రాష్ట్రం ఏర్పడినప్పుడు తలసరి ఆదాయం 1.24లక్షలు ఉంటే 2023లో 3.12 లక్షలు అయ్యింది
– నరెడ్కో సిల్వర్ జూబ్లీ వేడుకల్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
హైదరాబాద్: (జనం సాక్షి )
హైదరాబాద్ ట్రైడెంట్ హోటల్లో జరిగిన నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (NAREDCO) సిల్వర్ జూబ్లీ వేడుకలకు భారత మాజి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తో కలిసి రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
విజనరీ లీడర్ కేసిఆర్ గారి వల్లే నేడు అత్యంత సేఫెస్ట్ సిటీగా హైదరాబాద్ మహా నగరం అవతరించిందని మంత్రి ఈ సందర్బంగా వ్యాఖ్యానించారు.ఇప్పుడు మన హైదరాబాద్ పెట్టుబడులకు స్వర్గదామం అయ్యిందని,కెటిఆర్ గారు SRDP ప్రోగ్రాం ద్వారా ఫ్లై ఓవర్లు,అండర్ పాస్లు నిర్మించి రోడ్ కనెక్టివిటీ పెంచారన్నారు. హైదరాబాద్ తో పాటు తెలంగాణ రూరల్ ఎకానమీని సీఎం కేసిఆర్ గణనీయంగా పెంచారని దీంతో ప్రజల కొనుగోలు శక్తి పెరిగిందన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ విస్తరిస్తోందని,టిఎస్ బి పాస్ ద్వారా 21 రోజుల్లోనే భవన నిర్మాణ అనుమతులు లభిస్తున్నాయని అన్నారు.
“వరల్డ్ లార్జెస్ట్ మల్టీ లెవల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్” ఏది అని గూగుల్ సెర్చ్ చేయాలని మంత్రి కోరగా ఢిల్లీకి చెందిన బిజినెస్ మెన్ సెర్చ్ చేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ అని బదులిచ్చారు. దీంతో సమావేశంలో పాల్గొన్న వారు చప్పట్లతో తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.”
మంత్రి స్పీచ్ ముఖ్యమైన పాయింట్స్
•తెలంగాణలో శతాబ్ది కాలంలో జరగని అభివృద్ధి కేసిఆర్ గారి నాయకత్వంలో దశాబ్ధి కాలంలో జరిగింది.
• 9 ఏళ్ల తెలంగాణ, 77 ఏళ్ల స్వతంత్ర భారత్ కు మార్గదర్శిగా, దిక్సూచిగా మారింది.
• కొట్లాడి సాధించుకున్న తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకువెళ్లి, దేశానికి రోల్ మోడల్ గా నిలిచింది.
కేసిఆర్ గారు చేపట్టిన ఒక్కో పథకం, ఒక్కో కార్యక్రమం, ఒక్కో నిర్ణయం.. ఆచితూచి ఆలోచించి అమలు చేసినవే.
• అభివృద్ధి, సంక్షేమం అనే జోడెడ్ల మీద సాగిన 9 ఏళ్ల ప్రయాణం తెలంగాణ తలరాతను మార్చి, బంగారు భవిష్యత్తుకు బాటలు వేసింది.
• నేడు తెలంగాణ ఆచరిస్తుస్తే, దేశం అనుసరిస్తున్నది.
సంక్షేమ కార్యక్రమాలు – పరిపాలన సంస్కరణలు – సంపద సృస్టి
రాష్ట్ర ప్రగతి సూచీ :
2013-14లో తెలంగాణ జీఎస్డీపీ – 4,51,580 కోట్లు.
2022-23 నాటికి -13.27 లక్షల కోట్లకు చేరింది.
పోయిన ఏడాది కంటే ఇది 15.6% వృద్ధి. దక్షిణాది రాష్ట్రాల్లోనే అగ్రగామిగా తెలంగాణ నిలిచింది.
జీడీపీలో తెలంగాణ వాటా 2014-15లో 4.1% గా ఉంటే, నేడు అది 4.9% పెరిగింది.
దేశ జనాభాలో తెలంగాణ వాటా -2.96శాతం
దేశ అభివృద్ధి కోసం తెలంగాణ అందిస్తున్న జీడీపీ వాటా -4.9శాతం.
దేశాభివృద్ధికి తెలంగాణ రూపాయి ఇస్తే, దేశం తెలంగాణకు 46 పైసలు ఇస్తున్నది.
రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం: 2014 లో – 1110 యూనిట్లు, 2023 లో -2126 యూనిట్లకు పెరిగింది.. జాతీయ సగటు 1255 యూనిట్లు మాత్రమే.
– ఒక దేశం, ఒక రాష్ట్రం అభివృద్ధి చెందిందని చెప్పేందుకు తలసరి ఆదాయం ఒక ప్రధానమైన ప్రమాణం.
2014-15లో దేశ తలసరి ఆదాయం-రూ.86,647, తెలంగాణ తలసరి ఆదాయం -రూ.1,24,104.
2022-23లో దేశ తలసరి ఆదాయం-1,72,000 పెరగగా, తెలంగాణ తలసరి ఆదాయం గణనీయంగా 3,12,115కు పెరిగింది.
9 ఏండ్లలో దేశ తలసరి ఆదాయ వృద్ది – 98% అయితే, తెలంగాణది 156%.
ఒక్క 2022-23లోనే తెలంగాణ తలసరి ఆదాయం 41వేలు పెరిగింది. తెలంగాణ చరిత్రలో ఆల్ టైం రికార్డ్.
దేశాన్ని సాదుతున్న మొదటి 5 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని, దేశ ఆర్థిక వ్యవస్థకు తెలంగాణ ఊతం ఇస్తున్నదని గతంలోనే ఆర్బీఐ హ్యాండ్ బుక్ ద్వారా వెల్లడించింది. వయస్సు చిన్నదైనా అభివృద్ధిలో రెట్టించిన ఉత్సాహంతో తెలంగాణ ముందుకు వెళ్తున్నదని నీతి అయోగ్ చైర్మన్ రాజీవ్ కుమార్ 2021లోనే చెప్పారు.
2004-2014 మధ్య తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి ముందు 10 సంవత్సరాలలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన ₹26,211.5 కోట్లు
రాష్ట్ర ప్రభుత్వం 2014-23లో హైదరాబాద్ మరియు అర్బన్ తెలంగాణలలో మౌలిక సదుపాయాలు మరియు మూలధన పెట్టుబడులపై చేసిన ఖర్చు ₹1,21,294 కోట్లు
5 రెట్లు ఎక్కువ
సీఎం కేసీఆర్ గారు రాష్ట్ర సంపద పెంచుతూ, పేదలకు పంచుతున్నారు
• వ్యవసాయ రంగం: సీఎం కేసీఆర్ ఆలోచనతో సాగునీటి రంగంలో తీసుకున్న చర్యలు తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా మార్చాయి.
విషయం 2014 కు ముందు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత
భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల పై చేసిన వ్యయం రూ. 38,405.12 కోట్లు, 9 ఏళ్లలో రూ. 1,55,210.86 కోట్లు ఖర్చు చేశారు.
సాగు విస్తీర్ణం
2014 లో మొత్తం పంట సాగు విస్తీర్ణం 1,43,49,186 ఎకరాలు
2022-23 లో మొత్తం పంట సాగు విస్తీర్ణం.2,08,72,978 ఎకరాలు.
2014 లో వరి పంట సాగు విస్తీర్ణం 49,63,068 ఎకరాలు
2022-23 లో వరి పంట సాగు విస్తీర్ణం కోటి 20 లక్షల ఎకరాలు.
పెరిగిన పంట సాగు విస్తీర్ణం 140 %
ఉత్పత్తి వివరాలు
2013-2014 లో వరి పంట ఉత్పత్తి 99,33,471 మెట్రిక్ టన్నులు
2021-22 లో వరి పంట ఉత్పత్తి 2,48,65,662 మెట్రిక్ టన్నులు
పెరిగిన వరి పంట ఉత్పత్తి 150 %
రైతు బంధు…
కెసిఆర్ ప్రభుత్వం రైతు బంధు ద్వారా 2018 నుంచి 2023 నాటికి 11 విడతల్లో 65 వేల మంది రైతులకు 72,800 కోట్లు పంట పెట్టుబడి సాయంగా అందజేసింది.
రైతు బీమా…
రైతు ఏకారణం చేత మృతి చెందిన వారి కుటుంబానికి రూ.5 లక్షల సాయం కింద ఇప్పటివరకు రూ.5,400 కోట్లు ఇవ్వడం జరిగింది. రైతు భీమా పథకానికి ఐక్య రాజ్య సమితి గుర్తింపు లభించడం తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణం.
ఋణ మాఫీ..
రెండు దఫాలలో 72 లక్షల మంది రైతులకు 36 వేల కోట్ల పంట రుణాన్ని మాఫీ చేసిన/చేస్తున్న దేశంలోనే ఏకైక రాస్ట్రం తెలంగాణ
ఆసరా పెన్షన్లు..
2004 నుండి 2014 వరకు కేవలం 5500 కోట్ల రూపాయల పెన్షన్ లు ఇస్తే 2014 నుండి 2023 వరకు రూ. 60,000 కోట్లు ఆసరా పెన్షన్ ల కింద కేసీఆర్ ప్రభుత్వం అందచేసింది.
కళ్యాణ లక్ష్మీ: 12,71,839 మంది కి 11,130 కోట్లు ఖర్చు చేసింది.
కేసీఆర్ కిట్ : 1300 కోట్లు ఖర్చు చేసింది.
గొర్రెలు: 7.5 లక్షల యూనిట్లకు రూ. 11,000 కోట్ల ఖర్చు చేసింది.
పల్లె ప్రగతి: రూ.13,528 కోట్లు
చేపలు: 4 లక్షల టన్నుల ఉత్పత్తికి రూ. 6000 కోట్లు ఖర్చు చేసింది.
విద్య: రెసిడెన్షియల్ స్కూల్: 2014 – రూ. 9500 కోట్లు , 2023 – రూ.30,000 కోట్లు
ఆరోగ్య శ్రీ: CMRF: రూ. 10,000 కోట్లు
పరిశ్రమలు & ఐటి: పరిశ్రమల ఏర్పాటులో అత్యంత పారదర్శకంగా అనుమతులు ఇస్తున్న రాష్ట్రం మన తెలంగాణ మాత్రమే. ఇందులో యువ మంత్రి కెటిఆర్ గారిది విశేష కృషి ఉంది. టీఎస్ ఐపాస్ విధానంలో 15 రోజుల్లో అనుమతులు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ. అమెరికాలో కూడా ఇలాంటి విధానం లేదు అని అక్కడి పారిశ్రామిక వేత్తలు చెబుతున్నరు. యాపిల్, అమెజాన్, ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్, ఉబెర్, గూగుల్, క్వాల్‌కామ్, ఫాక్స్ కాన్ లాంటి తదితర ప్రఖ్యాత అంతర్జాతీయ కంపెనీల రెండో అతిపెద్ద కార్యాలయాలు మన రాష్ట్రంలోనే ఏర్పాటు.
పరిశ్రమలు – 20,000, పెట్టుబడి – రూ.3,00,000 కోట్లు
ఉద్యోగాలు – 17 లక్షలు
ఐటి ఎగుమతులు – 2014 – రూ.57,000 కోట్లు, 2023 – రూ.1,87,000 కోట్లు.
ఐటి ఉద్యోగాలు – 6 లక్షలు
ఫార్మా రంగం – గణనీయ అభివృద్ధి
రియల్ ఎస్టేట్ : టీఎస్ బీపాస్ దేశంలోనే ఎక్కడా లేదు, తమిళనాడు సీంఎ లాంటివారే దీనికి మెచ్చుకున్నారు. 21 రోజుల్లోనే భవన నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నాము.
హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో భూముల ధరలు బాగా పెరిగాయి. రియల్ ఎస్టేట్ రంగం మూడు పువులు – ఆరు కాయల చందాన మారింది. కొంత కరోనా వల్ల ఇబ్బంది పడ్డారామో కాని, ఇతర ఏ అంశాలు రియల్ బూమ్ ను అడ్డుకోలేదు.
సీఎం కేసీఆర్ పాలన , ఆయా అనుమతుల్లో పారదర్శకత, వేగం, శాంతిభద్రతలు, పరిశ్రమలకు, గృహావసరాలకు అవసరమైన తాగు నీరు ఇవన్నీ రియల్ ఎస్టేట్ రంగానికి ఊపు తెచ్చాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరింత వేగంగా అభివృద్ధి చెందుతోంది.” అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.