విజయవంతంగా సామూహిక జాతీయ గీతాలాపన
నల్గొండ బ్యూరో. జనం సాక్షి ,
మంగళవారం ఉదయం 11-30 గంటలకు జిల్లా కేంద్రంలో క్లాక్ టవర్ సెంటర్ లో సామూహిక జాతీయ గీతాలాపన విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి,జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి,ఎస్.పి. రెమా రాజేశ్వరి, మున్సిపల్ చైర్మన్ యం. సైది రెడ్డి,వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్,జడ్పీ ప్లోర్ లీడర్ పాశం రాం రెడ్డి,జిల్లా విద్యా శాఖ అధికారి బిక్ష పతి,మున్సిపల్ కమిషనర్ కె.వి.రమణా చారి పలువురు జిల్లా అధికారులు,ప్రజలు,విద్యార్థులు పెద్ద సంఖ్య లో కలిసి పాల్గొని సామూహిక జాతీయ గీతాలాపన చేసారు.
ఈ సందర్భంగా రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా 75 ఏళ్ల స్వతంత్ర భారత వజ్రోత్సవాలను జరుపుకుంటున్నామని, అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో రెండు వారాలపాటు వజ్రోత్సవాలను రోజుకొక కార్యక్రమం చేపట్టి ఘనంగా నిర్వహించాలని తెలిపారని, అధికారులు, ప్రజలు మమేకమై స్వాతంత్య్ర ఉద్యమం చేసిన మహనీయులను స్మరించుకొంటూ ఆ స్ఫూర్తిని యువతలో, ప్రజల్లో తీసుకెళ్లి భావితరాలకు స్వాతంత్య్ర ఫలాలు అందించడానికి కృషిలో భాగంగా 15 రోజుల ఈ కార్యక్రమంలో 75 ఏళ్లు పూర్తి చేసుకొని సోమవారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకున్నామని, ఈ రోజు నిర్వహించుకున్న సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో వేలాదిగా విద్యార్ధులు, పట్టణ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్,ఎస్.పి, ఎమ్మెల్యే, మునిసిపల్ చైర్మన్ పాల్గొన్నారని అన్నారు మహాత్మాగాంధీ, ఎందరో త్యాగ దనులు లాంటి వాళ్లు త్యాగాలు చేసి కుటుంబాలను త్యజించి బ్రిటిష్ పరిపాలన నుండి దేశానికి స్వాతంత్య్రాన్ని తీసుకొచ్చారని అన్నారు ముఖ్యమంత్రి ప్రాణాలను ఫణంగా పెట్టి తెలంగాణను సాధించుకున్నారని, 8 ఏళ్ల తెలంగాణ రాష్ట్రంలో పేదలకు అన్ని రకాల సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగుతున్నాయని, దీనిని కొనసాగించే క్రమంలో భాగంగా ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసికట్టుగా ప్రజలకు, ప్రభుత్వానికి మధ్యలో వారధిగా ఉండి ఈ జిల్లాను, ఈ ప్రాంతాన్ని, ప్రాంత ప్రజలను అన్ని రకాలుగా అభివృద్ధి చేయుటకు కంకణబద్ధులై మరొక్కసారి పునరంకిత మవుదామని తెలిపారు.