విజయవాడలో జరిగే సిపిఐ మహాసభలకు ప్రత్యేక రైలు
వరంగల్ లో ప్రారంభించిన రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
-బహిరంగ సభకు తరలివెళ్ళిన 5వేల మంది సిపిఐ కార్యకర్తలు
వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 14(జనం సాక్షి)
విజయవాడలో ఈ నెల 14 నుండి 18 వరకు జరుగనున్న సిపిఐ జాతీయ మహాసభలకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి ప్రత్యేక రైలు ఏర్పాటు చేశారు. ఈ రైలును సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు శుక్రవారం ఉదయం 8 గంటలకు వరంగల్ రైల్వే స్టేషనులో జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలులో బయలుదేరి వెళ్లిన ఐదు వేల మంది సిపిఐ కార్యకర్తలు శుక్రవారం విజయవాడలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 24 వ.జాతీయ మహాసభలు విజయవాడలో జరుగుతున్నాయని, తొలి రోజు బహిరంగ సభ విజయవంతం చేయడానికి పార్టీ కార్యకర్తలు, నాయకులు, కార్మిక ,కర్షక, మేధావి వర్గం పాల్గొంటున్నారని తెలిపారు. ఈ బహిరంగ సభకు వరంగల్ జిల్లా హనుమకొండ జిల్లా మహబూబాబాద్ జిల్లా నుండి 5000 మంది వరంగల్ రైల్వే స్టేషన్ నుండి స్పెషల్ ట్రైన్ లో తరలి వెలుతున్నట్లు తెలిపారు.ఈ మహాసభలు జాతీయ జాతీయ రాజకీయాలలో పెను మార్పులను తీసుకురానున్నాయని తెలిపారు.ముఖ్యంగా కేంద్రం ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్పొరేట్ అనుకూల విధానాలు, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం, రాజ్యాంగ విలువల ద్వంసం, మైనారిటీ వర్గాల పై దాడులు, ప్రతిపక్ష పార్టీల ప్రజాప్రతినిధుల కొనుగోళ్లు లాంటి అప్రజాస్వామిక, ప్రజా వ్యతిరేక విధానాలపై మహాసభలలో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. ఈ మహాసభలకు వివిధ దేశాలు, రాష్ట్రాల నుండి వందలాది మంది ప్రతినిధులు పాల్గొంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ సమితి సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి, రాష్ట్ర నాయకులు టి. వెంకట రాములు, వరంగల్,హనుమకొండ జిల్లాల కార్యదర్శి మేకల రవి, కర్రె బిక్షపతి,జిల్లా సహాయ కార్యదర్శులు షేక్ బాష్ మియా, తోట బిక్షపతి,కరీంనగర్ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి, జిల్లా కార్యవర్గ సభ్యులు బుస్సా రవీందర్,గన్నార రమేష్, దండు లక్ష్మణ్, ఆదరి శ్రీనివాస్,మద్దెల ఎల్లేష్,మోతే లింగారెడ్డి,ఎన్.రాజమౌళి,గుండె బద్రి, బాషబోయిన సంతోష్, కె. చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
Attachments area