విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తున్న జిల్లా క్లాస్మేట్ క్లబ్ అధ్యక్షుడు వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్
వనపర్తి టౌన్* నవంబర్ 11 ( జనం సాక్షి) వనపర్తి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల గోపాల్పెట్ వేదికగా, మండల స్థాయిలో క్లాస్మేట్ క్లబ్ సంస్థవారు నిర్వహించిన ఆంగ్ల పదాల పోటీలో, గోపాల్పేట మండలంలో 8 పాఠశాలలకు పైగా నాలుగవ తరగతి నుండి, పదవ తరగతి వరకు, బాల బాలికలు పాల్గొనడం జరిగింది. బహుమతి ప్రధానోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమానికి వనపర్తి మున్సిపల్ వైస్ చైర్మన్ మరియు, క్లాస్మేట్ క్లబ్ వనపర్తి జిల్లా అధ్యక్షులు వాకిటి శ్రీధర్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. గోపాల్పేట స్థానిక క్లాస్మేట్ క్లబ్ సంస్థ సభ్యులు లగిశెట్టి ప్రకాష్, నందు, పై కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా విచ్చేసి వి జెతలకు బహుమతి ప్రధానం చేయడం జరిగింది. వాకిటి శ్రీధర్ మాట్లాడుతూ, క్లాస్మేట్ క్లబ్ నిర్వహిస్తున్న, విద్యాపరమైన ప్రోత్సాహాన్ని కొనియాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆంగ్ల మాధ్యమంలో బోధన,అన్న అంశం సామాన్యులకు అందుబాటులో తెచ్చే దిశగా క్లాస్మేట్ క్లబ్ నిర్వహిస్తున్న, ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్రమంతట ఆదర్శనీయమని ప్రశంసించారు. స్థానిక ఉన్నతపాఠశాల ప్రధానోపాధ్యాయులు రమాకాంత్, మాట్లాడుతూ క్లాస్మేట్ క్లబ్ సంస్థ సభ్యులు ప్రకాష్ పాఠశాల పూర్వ విద్యార్థి, పాఠశాల బహుళ ప్రయోజనాల కోసం అనేక విధాలుగా విద్యాభివృద్ధికి తోడ్పడుతున్నారని, కొనియాడారు. పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయులు కార్యక్రమ నిర్వహణలో పూర్తి బాధ్యత వహించి కార్యక్రమం జయప్రదం చేయుటకు తోడ్పడినారు. మండల స్థాయివిజేతలు ఎస్. అక్షర ఆరవ తరగతి, యు.పి.ఎస్ తాడిపర్తి, కే. శైలజ, ఏడవ తరగతి, జడ్పీహెచ్ఎస్, బాయ్స్ గోపాల్పేట్, c. కీర్తన, 8వ తరగతి యు.పి.ఎస్ తాడిపర్తి, పి.గ్రీష్మ, 9వ తరగతి జెడ్పిహెచ్ఎస్. బాయ్స్ గోపాల్పేట్, బి స్పందన పదవ తరగతి, జడ్పీహెచ్ఎస్ ఏదుట్ల, ఎస్. గీత ఐదవ తరగతి పి.ఎస్ నర్సింగాయపల్లి, పి భాను ప్రసాద్, నాలుగవ తరగతి పి.ఎస్ నరసింహాయపల్లి. ఈ విధంగా,4వ తరగతి నుండి పదవ తరగతి వరకు ,జిల్లా స్థాయి పోటీకి ఎంపిక కాబడిన విద్యార్థులు. జిల్లా స్థాయి కార్యక్రమం ఎక్కడ, ఎప్పుడు నిర్వహిస్తారో త్వరలోనే నిర్వాహకులుతెలియజేయగలరు. పాఠశాల ఉపాధ్యాయ కార్యదర్శి డి.పరమేశ్వర చారి వందన సమర్పణ తో కార్యక్రమం విజయవంతం చేశారు.