విజ్ఞానమనేది తరగనిది, వయసుతో సంబంధం లేకుండా జ్ఞానాన్ని సంపాదించడమనేది నిరంతర ప్రక్రియ

ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి

గ్రంధాలయాలు విజ్ఞాన భాండాగారాలు
– రెండు కోట్లతో నిర్మించే కొత్తభవనలో జిల్లా కవులు, కళాకారుల కావ్యాలు అందుబాటులోకి చేస్తాం
– ముగిసిన 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు
నాగర్ కర్నూల్ జిల్లా బ్యూరో నవంబర్ 21 జనం సాక్షి:
 విద్య వికాసానికి మూల మని, అందుకే ప్రతీ ఒక్కరు గ్రంథాలయాలకు వచ్చి విజ్ఞానం పొందాలని ఎమ్మెల్యే అన్నారు. సోమవారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ హనుమంతరావు అధ్యక్షతన నిర్వహించిన 55వ జాతీయ గ్రంథాలయాల వారోత్సవాల ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్య ప్రగతికి దోహదం చేస్తుందని, ప్రతీ ఒక్కరు విద్యను అభ్యసించాలని సూచించారు. అదేవిధంగా జీవిత పాఠాలు కూడా నేర్పిస్తుందని అన్నారు. గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు అని,
 నాగర్ కర్నూల్ పట్టణంలో రానున్న మూడు మాసాల్లో కొత్త భవన రెండు కొట్లుతో నిర్మాణ పూర్తికానుందని అందులో అన్ని సౌకర్యాలతో పాటు అన్ని రకాల పుస్తకాలతో పాటు నాగర్ కర్నూల్ జిల్లా కవులకు సంబంధించిన కావ్యాలు చరిత్రలు అందుబాటులో ఉండేలా నేటితరం విద్యార్థులకు కందనూర్ కవులు, కళాకారు చరిత్రను అందుబాటులో ఉంచుతామని వివరించారు.
విజ్ఞానమనేది తరగనిది, వయసుతో సంబంధం లేకుండా జ్ఞానాన్ని సంపాదించడమనేది నిరంతర ప్రక్రియ అని గ్రంథాలయాలను నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తానని అన్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా గ్రంధాలయ చైర్మన్ హనుమంతరావు మాట్లాడుతూ….
గ్రంథాలయాలు విద్యతో పాటు జ్ఞానాన్ని అందిస్తాయని ప్రతి ఒక్కరూ గ్రంథాలయాన్ని సందర్శించి పుస్తకాలు గ్రంథాలను చదివి జ్ఞానం పెంచుకోవాలని కోరారు.
గ్రంథాలయ అభివృద్ధికి ఎమ్మెల్యే చేస్తున్న కృషిని ఆయన అభినందించారు.
నియోజకవర్గంలో విద్యను బలోపేతం చేసేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ మున్సిపల్ వైస్ చైర్మన్ బాబురావు, బిజినపల్లి ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్,గ్రంథాలయ కార్యదర్శి వెంకటయ్య, లైబ్రరీ చైర్మైన్ సుబ్బయ్య,జయపాల్ రెడ్డి, మంగివిజయ్,బంగారయ్య,కరణ్ లాల్ మోతీలాల్ వనపట్ల సుబ్బయ్య కందికొండ మోహన్ ముచ్చర్ల దినకర్ కల్వకోల్ మద్దిలేటి గ్రంథాలయ సిబ్బంది. అరుంధతి ,పరమేశ్వరి,జిలాని,అలివేలు,
తాజుద్దీన్,సంతోష్, పవన్,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు