విడిపోవుడు కలిమికోసమే

వాళ్లతోటి ఏగుడు కష్టం
కాలుకేస్తె మెడకేస్తరు
మెడకేస్తె కాలుకేస్తారు
ఏవో కథలు చెబుతారు
జోకొడుతారు ..మనం ఊ కొట్టాలే ..
ముక్కుసూటి మాట మనది
నిలబడ్తం మాటమీద
మందిని ముంచుడు రాదు
మనిషి నమ్ముడే మన మన మతం
మీ మాట మా మాట ఒకటంటిరి
యాస ఉన్న బాస వొక్కటేనంటిరి
మీ మాట సినిమాల్లో హీరోలకి బెడ్తిరి
మా మాట విలన్లకి జోకర్లకు బెడ్తిరి
మాది నవ్వులాట బాస జేస్తిరి
మీది శాని మాట అయిపోయిందా?
మనం మనం తెలుగు వాళ్లమని
మా తెలెగే ఎక్కిరియ్య బడ్తిరి
చరిత్రలో మేం నవాబుల కింద ఉంటిమి
మీరు తెల్ల దొరలకింద ఊడిగం ఉంటిరి
తెల్ల దొరని దించెటానికి మీరు సత్యాగ్రహాలు జేస్తిరి
రాజును దించేటానికి మేం బందూకుల బడ్తిమి
తెలుగువాళ్లమే అనుకుందాం మాటవరుసకు
మన పోరాట పద్దతులు వేరు పటిమ వేరు
ఇప్పటికీ అప్పటినుంచి మానరాల్లో
తిరగబడుతుంటే ఆగ్రహంతోటే
ఇది యాది ఉంచుకోండ్రీ గల్తీ చేయకండి
ఇయ్యాల కాకుంటే రేపో
మనం విడిపోయినా
మనం కలిసి ఉన్ననాటి తెలుగు దినం సమసిపోదు
మన దోస్తానా మరింత పక్కాఅయ్యే అవకాశం ఉంది
అందువల్ల విడిపోవుడుతో మన భాషా బంధం కలిసే ఉంటుంది
భాష వల్లే మనం రాష్ట్రం కొనసాగడం పొసగని పని
అందుకే అంటాం
విడిపోదాం పాలివాళ్లలా
కలిసి ఉందాం అన్నదమ్ముల్లా…!
-దామెర రాములు
నిర్మల్‌ 504106
ఆదిలాబాద్‌
సెల్‌:9866422494