విత్తనాలు,ఎరువులపై రైతుల అప్రమత్తం

సేంద్రియ వ్యవసాయం అధికారుల ప్రోత్సాహం

మెదక్‌,జూన్‌14(జ‌నం సాక్షి): నకిలీ విత్తనాలు, సేంద్రియ ఎరువులపై రైతులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నామని జిల్లా వ్యవసాయ అధికారులు తెలిపారు. అన్నారు. రైతులకు శిక్షణ సందర్భంలో ప్రత్యేకంగా సేచిస్తున్నామని అన్నారు. సేంద్రియ ఎరువులతో పంటల సాగుపై జిల్లా రైతులు దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. రైతులకు సేంద్రియ ఎరువుల వినియోగంతో పంటల సాగుపై ఇచ్చిన శిక్షణ మంచి ఫలితాలు ఇచ్చిందన్నారు. సేంద్రియ పద్ధతిలో పంటల సాగు వల్ల భూసారం పెరుగుతుందని, సేంద్రియ పద్ధతిలో పండించిన ఆహార ధాన్యాల్లో అనేక రకాల పోషకాలు ఉంటాయన్నారు. మార్కెట్‌లో సేంద్రియ పద్ధతిలో పండించిన ఉత్పత్తులకు అధిక ధర పలకడంతో పాటు డిమాండ్‌ ఉందన్నారు. సేంద్రియ ఎరువులవాడకం, తయారీ, సేంద్రియ వ్యవసాయంలో అనుసరిచే పద్ధతుల గురించి రైతులకు వివరించామని అన్నారు. సేంద్రియ పదార్థాల తో ఎరువులు, పురుగుమందుల తయారీ, వాడకంపై ప్రయోగాత్మకంగా అవగాహన కల్పించారు. వ్యవసాయ శాఖ అధికారుల అనుమతి లేకుండా ఎరువులు, విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాకుండా ప్రభుత్వం గుర్తించిన ఎరువులు, విత్తనాలను మాత్రమే ఎరువుల దుకాణాలలో విక్రయించాలని దుకాణాల యజమాలకు ఆదేశాలు జారీ చేశారు.జిల్లాలోని అన్ని ఫెర్టిలైజర్ల దుకాణాలు, ఎరువుల దుకాణాలపై జిల్లా వ్యవసాయ శాఖ యంత్రాంగం తనిఖీలు నిర్వహిస్తుంది. మెదక్‌ పట్టణంలోని ఆయా దుకాణాలను తనిఖీ చేశారు. ప్రతి ఏడాది రైతాంగాన్ని మోసగించిన ఎరువులు, విత్తనాలు, క్రిమి సంహారక మందు వ్యాపారుల అక్రమాలకు అడ్డుకట్ట పడనుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ ముందుగానే నకిలీ ఎరువులు, విత్తనాలపై దృష్టి పెట్టింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ముందస్తుగానే చర్యలకు ఉపక్రమిస్తుంది. వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు లేకుండా ఎరువులు, విత్తనాలు, క్రిమి సంహారక మందులు అమ్మితే సంబంధిత దుకాణాలపై కేసులను నమోదు చేయాలని ఆదేశించింది. ఎరువులు, విత్తనాలకు సంబంధించి నిల్వ ఉంచే గోదాముల సమాచారాన్ని వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే సేకరించారు. ఖరీఫ్‌ సీజన్‌ మొదలు కావడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు టీంలుగా ఏర్పడి జిల్లా వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేశారు.