విత్తనాలు సరఫరా చేయాలి
రేగుండ, మండలంలోని రైతులందరికీ సరిపడు పత్తి విత్తనాలు సరఫరా చేయాలని తెరాసా రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యుడు తిరుకొండ మధుసూదనాచారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెరాసా మండల కమిటీ అధ్వర్యంలో మంగళవారం నాయకులు తహసిల్దారు బైరు మహేందర్‌రెడ్డికి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అద్యక్షుడు పి.రవి, నాయకులు బిక్షపతి, ఉమేష్, కార్యకర్తలు పాల్గొన్నారు.