విద్యారంగ సమస్యలను గాలికొదిలిన పాలకులు

తొర్రూర్ 18 అక్టోబర్( జనంసాక్షి )    రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పట్టించుకోవడంలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం వారి సమస్యలను గాలికి వదిలిందని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం*( పిడిఎస్యు) మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు చెదల ప్రశాంత్ అన్నారు. పిడిఎస్సి ఆధ్వర్యంలో తొర్రూరు మండల ఏడవ మహాసభ నేడు శేఖర్ ప్రదీప్ ల అధ్యక్షతన జరిగింది. ఈ మహాసభలకు ముఖ్యఅతిథిగా హాజరైన ప్రశాంత మాట్లాడుతూ లక్షలాదిమంది పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ అందక అనేక కష్టాలు పడుతున్నారని చదువులు మానుకుంటున్నారని అన్నారు. రోజురోజుకు పెరుగుతున్న నిత్యవసర సరుకుల ధరల భారంతో విద్యార్థులకు ఇవ్వాల్సిన మెస్ చార్జీలు సరిపోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ విద్యాసంస్థలలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించడానికి పోరాటాన్ని తీవ్రతరం చేయనున్నామని ఆయన తెలిపారు. పీజీ వరకు ఉచిత విద్య అనేది చెత్తబుట్టలో పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు.నూతన జాతీయ విద్యా విధానం పేరుతో బిజెపి ప్రభుత్వం అశాస్త్రీయ భావాలను ప్రజాస్వామిక విలువలను పెంపొందిస్తున్నారని ఆర్ఎస్ఎస్ చేస్తున్న కుట్రలను విద్యార్థి లోకం తిప్పికొట్టాలని అన్నారు అందులో పి డి ఎస్ యు దశల వారి పోరాటాలు నిర్వహిస్తుందని విద్యార్థి లోకం పెద్ద ఎత్తున కదిలి రావాలని అన్నారు. డిసెంబర్ రెండో వారంలో పిడిఎస్యు రాష్ట్ర మహాసభలను హైదరాబాదులో నిర్వహిస్తున్నామని ప్రశాంత్ తెలిపారు. జిల్లా నాయకులు భూక్య సంతోష్ నూతన కార్యవర్గాన్ని ప్రతిపాదించారు.       9 మందితో నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అధ్యక్షుడిగా ఏనుగుల ప్రదీప్ ఉపాధ్యక్షులు ఏం వెంకన్న ప్రధాన కార్యదర్శి బానోత్ శేఖర్ సహాయ కార్యదర్శి బి సంతోష్ కోశాధికారి సాయినాథ్ కార్యవర్గ సభ్యులుగా నరేందర్ శ్రీకాంత్ వినయ్ అరుణ్ రాజేందర్ యాకన్న ఎన్నికయ్యారు.అనంతరం విద్యారంగ సమస్యలపై వాళ్లు తీర్మానాలను మహాసభ ఆమోదించింది.